04-09-2025 06:22:19 PM
చొప్పదండి (విజయక్రాంతి): వర్ష బయోసైన్స్ అండ్ టెక్నాలజీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో రాముడు మండలం వెలిచాల గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. రైతులకు ఫెర్టిలైజర్ ఎక్కువ వాడకం కలిగే నష్టాలు, వర్ష కంపెనీ వాడకం వల్ల కలిగే ఉపయోగాల గురించి వివరించారు. 200 రైతులు పాల్గొని వారి సందేహాలు నివృత్తి చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వర్ష బయోసైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రోజర్ మ్యాథ్యూ, తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ విజయ్, కరీంనగర్ ఏరియా మేనేజర్ సురేష్ రెడ్డి, వరంగల్ ఏరియా మేనేజర్ కిషోర్, స్థానిక డీలర్ దుర్గా సీడ్స్ అండ్ పెసైడ్స్ ఇంచార్జ్ రమణారెడ్డి, రైతులు పాల్గొన్నారు.