calender_icon.png 7 September, 2025 | 4:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సమన్వయంతో ప్రాణనష్టం జరగకుండా కాపాడగలిగాం

02-09-2025 12:00:00 AM

ఎస్పీ రాజేష్ చంద్ర 

కామారెడ్డి, నవంబర్ 1 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లాలో శతాబ్ద కాలంలో ఎప్పుడూ చూడని విధంగా భారీ వరదలు వర్షాలు సంభవించాయి. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రజల సహకారం, ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో  జిల్లాలో మళ్లీ సాధారణ పరిస్థితుల్లోకి చేరుకోగలిగామని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, తెలిపారు. సోమవారం ఆయన  మాట్లాడుతూ ఈ కష్టకాలంలో జిల్లా పోలీసులు తమ విధులను అంకితభావంతో నిర్వర్తించారు.

విపత్కర సమయంలో ఎదురైన ప్రమాదాలను ప్రాణాలను లెక్కచేయకుండా  రాత్రింబవళ్లు శ్రమించారు. అలాగే జెసిబి డ్రైవర్లు, వాలంటీర్లు, యువత, మున్సిపల్ సిబ్బంది తమ ప్రాణాలను సైతం పణంగా పెట్టి యూనిఫాం లేకున్నా యూనిఫాం ధరించిన వారిలా సేవ చేశారు. వీరందరి త్యాగమే ఎంతోమంది ప్రాణ రక్షణకు కారణమైంది. ఇలా పోలీసు శాఖకు మేమున్నం అని సహకరించిన వారిని జిల్లా ఎస్పీ శాలు వా, మెమొంటోతో సత్కరించారు.

అలాగే ఎస్పీ  పునరావాస కేంద్రాల్లో ఆహారం పంపి ణీ చేసిన వారు, సహాయక చర్యల్లో పాలుపంచుకున్న అధికారులు, సిబ్బంది, వాలం టీర్లు ప్రజలందరికీ కలెక్టర్  తరఫున, తన తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.  జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కే. నరసింహారెడ్డి,  కామారెడ్డి ఏఎస్పీ బి. చైతన్య రెడ్డి, కామారెడ్డి టౌన్ ఎస్హెచ్‌ఓ నరహరి, కామారెడ్డి రూరల్ ఇన్స్పెక్టర్ రామన్, భిక్నూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సంపత్ కుమార్,  జిల్లాలోని ఎస్‌ఐలు సిబ్బంది  పాల్గొన్నారు.