04-09-2025 06:19:23 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి(Sarvepalli Radhakrishnan Jayanti) వేడుకల సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణం అమీనాపురంకు చెందిన స్మూక్ష కళాకారుడు నిఖిల్ రావి ఆకుపై రాధాకృష్ణ చిత్రాన్ని రూపొందించాడు. రావి ఆకుపై రాధాకృష్ణ చిత్రం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటోంది.