20-09-2025 12:44:48 AM
దేశంలోని నాలుగు యాపిల్ స్టోర్లలో ఇదే పరిస్థితి
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: యాపిల్ లాంచ్ చేసిన బ్రాండ్ న్యూ ఐఫోన్ 17 ఫోన్లు శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చాయి. శుక్రవారం నుంచి 17 సిరీస్ మోడల్స్ అమ్మకాలు చేపడతామని యాపిల్ కంపెనీ ఫోన్లు రిలీజ్ చేసిన రోజే ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున యువత శుక్రవారం తెల్లవారుజాము నుంచే స్టోర్ల ముందు క్యూ కట్టారు. యాపిల్ కంపెనీకి న్యూఢిల్లీ, ముంబై, బెంగళూరు, పుణె నగరాల్లో సొంత షోరూంలు ఉన్నాయి.
ముంబైలోని జియో కన్వెన్షన్ సెంటర్‌లో ఉన్న స్టోర్‌లో వినియోగదారులు క్యూ లైన్లలో ఎగబడ్డారు. యాపిల్ ఐఫోన్‌కు రూ. 82,900, ఐఫోన్ ఎయిర్‌కు రూ. 1,19,000, ప్రో మోడల్‌కు రూ. 1,34,900, ప్రోమ్యాక్స్‌కు రూ. 1,49,900గా ధర నిర్ణయించారు. యాపిల్ ఫోన్లే కాకుండా యాపిల్ వాచెస్, ఎయిర్‌పోడ్స్ ప్రో 3 సేల్స్ కూడా మొదలయ్యాయి.