calender_icon.png 17 November, 2025 | 10:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అసెంబ్లీకి వెళ్లని జగన్ రాజీనామా చేయాలి

29-07-2024 12:55:05 AM

ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల

హైదరాబాద్, జూలై 28 (విజయక్రాంతి): అసెంబ్లీకి వెళ్లని వైఎస్ జగన్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలి - ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేగా గెలిచింది చట్టసభల్లో ప్రజల గొంతుక అవ్వడానికా? మీడియా ముందు సొంత డబ్బా కొట్టుకోవడానికా? అని ప్రశ్నించారు. ఐదేళ్ల పాలన అంతా అవినీతి, దోపిడీ అని, రాష్ట్రాన్ని మీరు అప్పుల కుప్ప చేసి పెట్టారని, నిండు సభలో అధికార పక్షం శ్వేతపత్రాలు విడుదల చేస్తుంటే మీరేమి చేస్తున్నారని నిలదీశారు. మీ పాలనపై విమర్శలకు, అసెంబ్లీలో ఆన్ రికార్డు సమాధానం ఇచ్చుకునే బాధ్యత మీది కాదా? ప్రజలకు అన్యాయం జరిగితే అధికార పక్షాన్ని ఫ్లోర్ అఫ్ ది హౌస్‌లో ప్రశ్నించే బాధ్యత మీది కాదా? అని ప్రశ్నించారు. అసెంబ్లీకి పోనని చెప్పే మీరు, ప్రతిపక్ష హోదాకే కాదు, ఎమ్మెల్యే హోదాకు కూడా అర్హులు కాదంటూ తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజాతీర్పును గౌరవించకుండా, అసెంబ్లీకి పోను అంటూ గౌరవ సభను అవమానించిన వాళ్లకు ఎమ్మెల్యేగా ఉండే అర్హత లేదని, తక్షణం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.