23-09-2025 02:50:57 PM
నంగునూరు: మండలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పండుగను పురస్కరించుకుని మండలం అంతటా ప్రత్యేక పూజలు, ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. మండల పరిధిలోని గట్లమల్యాల గ్రామంలో యువ సేన యూత్ అసోసియేషన్, భజరంగ్ దళ్, దేవిమిత్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. నిర్వాహకులు మండపాలను పూలతో అందంగా అలంకరించారు. అమ్మవారి విగ్రహాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మండపాలలో ప్రత్యేక పూజలు, హారతి కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి పాటలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. తొమ్మిది రోజుల పాటు కొనసాగే ఈ ఉచ్చవాలు ప్రతిరోజూ వివిధ రూపాలలో అమ్మవారిని అలంకరించి, పూజలు నిర్వహించనున్నారు.