23-09-2025 02:59:30 PM
నాగర్ కర్నూల్ జిల్లాలో మరో ఫైబర్ మోసం..
నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): ఒక లింకుతో సైబర్ నేరగాళ్లు(Cyber Criminals) ఓ వ్యక్తి అకౌంటు నుండి మూడు లక్షలు మాయం చేశారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురం రోడ్డులో నివాసం ఉంటున్న వసంత్ అనే వ్యక్తి సోమవారం సాయంత్రం తన ఫోన్ కి ఓ లింక్ రావడంతో క్లిక్ చేశాడు. అనంతరం కొద్ది క్షణాల్లోనే మూడు లక్షల పైగా తన అకౌంటు నుండి మాయమయ్యాయి. వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు వసంత్ తెలిపారు.