23-09-2025 02:55:05 PM
ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీల అనుమతులు రద్దు చేయాలి..
బెల్లంపల్లి అర్బన్: రాష్ట్ర కార్మిక సంక్షేమ బోర్డు ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలనీ ఏఐసీటీయూ, ఎంసీపీఐ(యూ) జిల్లా కార్యదర్శి సబ్బని రాజేంద్రప్రసాద్, జిల్లా సహాయ కార్యదర్శి పసుపులేటి వెంకటేష్ డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బెల్లంపల్లిలోని అసిస్టెంట్ లేబర్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ సంతోష్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా లేబర్ బోర్డు కార్మికులకు సంబంధించి యాక్సిడెంట్, నార్మల్ డెత్ లకు సంబంధించి ఎంక్వయిరీ(విచారణ) రిపోర్ట్ లేబర్ బోర్డులకు సబ్మిట్ చేయడానికి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇవ్వడం వల్ల కార్మికులకు తీవ్ర అన్యాయం జరగడమే కాకుండా అవినీతి జరిగే ఆస్కారం ఉందన్నారు.
ప్రైవేట్ కంపెనీలకు సంబంధించి ఏజెంట్లు కార్మికులను తీవ్ర ఇబ్బందులు పెడుతూ డబ్బులు వసూలు చేసే అవకాశాలు ఉన్నాయని ఆరోపించారు. ఏదైతే లేబర్ బోర్డు పునారాలోచించి, కార్మికుల దృష్టిలో ఉంచుకొని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలకు ఇచ్చిన అనుమతులు వెంటనే రద్దు చేయాలని కోరారు. పాత పద్ధతినే కొనసాగించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్మికులకు న్యాయం చేయాలని లేనియెడల లేబర్ బోర్డును ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బెల్లంపల్లి పట్టణ కార్యదర్శి అరేపెల్లి రమేష్, షేక్ సర్వర్, పోచం, బాలయ్య, నవీన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.