16 April, 2026 | 6:27 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

పూరీలో వైభవంగా జగన్నాథుడి రథయాత్ర

28-06-2025 01:13 AM

- లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు 

- సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రతో గుండిచా ఆలయానికి జగన్నాథుడి ప్రయాణం

- ఐదంచెల భద్రత.. 10 వేల మంది పోలీసులతో పటిష్ట ఏర్పాట్లు

భువనేశ్వర్, జూన్ 27: ప్రపంచ ప్రఖా ్యతి గాంచిన పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఈ అపరూప ఘట్టాన్ని కనులా రా వీక్షించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాది మంది భక్తులు పూరీ క్షేత్రానికి పోటె త్తారు. పూరీ వీధులన్నీ ఇసుకేస్తే రాలనంత జనసంద్రంతో నిండిపోయాయి. భక్తి పారవశ్యంలో మునిగి తేలిన భక్తుల ‘జై జగన్నాథ’ నినాదాలతో వీధులన్నీ మార్మోగిపోయాయి.

ఏటా ఆశాడ మాస శుక్లపక్ష విదియ నాడు పూరీ జగన్నాథుడి రథయాత్రను నిర్వహించడం ఆనవాయితీ. తొమ్మి ది రోజుల ఉత్సవంలో భాగంగా జగన్నాథ స్వామి తన సోదరుడు బలభద్రుడు, సోద రి సుభద్రతో కలిసి 12 శతాబ్ధానికి చెందిన ప్రధాన ఆలయం నుంచి గుండిచా ఆలయానికి యాత్రగా బయల్దేరి వెళ్లారు. సు మారు 3 కిలోమీటర్ల మేర సాగే యాత్ర లో భక్తులు జగన్నాథుడి రథమైన ‘నందిఘోష్’, బలభద్రుడి రథం ‘తాళధ్వజ’, సుభద్ర దేవి రథం ‘దర్పదళన్’లను లాగేందకు భక్తులు పోటీపడ్డారు.

జనాలు భారీ గా తరలిరావడంతో జగన్నాథుడి రథయా త్ర మెల్లిగా సాగుతుంది. అయితే పూరీ జగన్నాథుడి దర్శనం కోసం భక్తులు భారీగా తరలిరావడంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసింది. రథయాత్ర సందర్భంగా పూరీలో ఐదంచెల భద్రతా వలయాన్ని ఏర్పాటు చేశారు. 200 ప్లాటూన్ల పోలీసు బలగాలతో పాటు బీఎస్‌ఎఫ్, సీఆర్పీఎఫ్ వంటి కేంద్ర బలగాలకు చెందిన 8 కంపెనీలను మోహరించారు.

పూరీ నగరం చుట్టూ 10వేల మంది ఒడిశా పోలీసులు, సహా వివిధ సాయుధ బలగాలు పహారా కాస్తున్నారు. అంతేకాదు ఈసారి భద్రతలో భాగంగా ఆధునిక సాంకేతికతను వినియోగిస్తున్నారు. ఉత్తరా స్కేర్‌నుంచి పూరీ పట్టణం వరకు.. పూరీ నుంచి కోణార్క్ మార్గంలో దాదాపు 275 ఏఐ ఆధారిత సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇక దేశవ్యాప్తంగా జగన్నాథుడి ఆలయాల్లో రథయాత్ర కన్నుల పండువగా జరిగింది.

అదుపుతప్పిన ఏనుగులు..

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని ఖాది యా ప్రాంతంలోని జగన్నాథుని రథయాత్ర లో అపశ్రుతి చోటుచేసుకుంది. రథయాత్రలో భాగంగా ఉదయం 10.15 గంటల సమయంలో ఖాదియా ప్రాంతం గుండా వెళ్తుండగా మూడు ఏనుగులు ఒక్కసారిగా అదుపు తప్పి భక్తుల పైకి దూసుకొచ్చాయి. దీంతో తోపులాట చోటు చేసుకుంది. ఏనుగులు తమ పైకి రావడంతో తీవ్ర భయాం దోళనకు గురైన భక్తులు వాటి నుంచి తప్పించుకోవడానికి పరుగులు తీయడంతో గంద రగోళ పరిస్థితి నెలకొంది.

ఈ నేపథ్యంలో పలువురు భక్తులు గాయపడటంతో స్థానిక ఆసుపత్రిక తరలించారు. అయితే పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు మావటిలు తీవ్రం గా శ్రమించారు. ఎలాగోలా ఏనుగులను అక్కడి నుంచి తీసుకెళ్లడంతో 14 ఏనుగులతో రథయాత్ర కొనసాగించారు. అంతకు ముందు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ రథయాత్రను ప్రారంభించారు.