16 April, 2026 | 6:23 PM

Breaking News

గురుకుల విద్యాలయాలపై నిరంతర పర్యవేక్షణ: కలెక్టర్ బాదావత్ సంతోష్   •   బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలను ఖండించిన హరీశ్‌రావు   •   ముస్లిం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధం: అమిత్ షా   •   పెళ్లి చేసుకుంటానని మహిళపై అత్యాచారం.. బీజేపీ కౌన్సిలర్ కుమారుడిపై కేసు   •   99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు తీసుకురావాలి   •   ముదిరాజులు అన్ని రంగాల్లో రాణించాలి   •   మూడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు   •   ప్రభుత్వం హామీలు అమలు చేయకపోతే.. ఏప్రిల్ 22 నుంచి సమ్మె   •   సమన్వయంతో పనిచేస్తేనే అభివృద్ధి సాధ్యం   •   ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో అభివృద్ధి సంక్షేమ పథకాల అమలు చేసాం   •  

ఒకే వేదిక పంచుకోనున్న ఠాక్రే సోదరులు

28-06-2025 01:13 AM

త్రిభాషా విధానం వ్యతిరేకిస్తూ జూలై 5న నిరసనలు

ముంబై: మహారాష్ట్ర రాజకీయా ల్లో ఒక అద్భుత సన్నివేశం చోటుచేసుకోనుంది. 20 ఏళ్ల తర్వాత ఠాక్రే సోదరులు ఒకే వేదికను కలిసి పంచుకోనున్నారు. త్రిభాషా విధానం ఫా ర్ములాను వ్యతిరేకిస్తూ ఉద్దవ్ ఠాక్రే (శివసేన రాజ్ ఠాక్రే (మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన) జూలై 5న  ఒకే వేదికపై నిరసన చేపట్టనున్నారు.

ఈ విషయాన్ని శివసేన అధి కార ప్రతినిధి సంజయ్ రౌత్ ‘ఎక్స్’ లో పేర్కొన్నారు. ‘మహారాష్ట్రలోని పాఠశాలల్లో హిందీ భాషను విధించడాన్ని వ్యతిరేకిస్తూ ఠాక్రే సోదరులు ఐక్యంగా నిరసన చేపట్టునున్నారు. 20 ఏళ్లలో ఇద్దరు అన్నదమ్ములు ఒకే వేదికను పంచుకోనున్నారు. రా జకీయాల్లో పెను సంచలనం కాబోతుంది ఈ నిరసన. జై మహారాష్ట్ర’ అని పోస్టు పెట్టారు.

మహారాష్ట్ర ప్రభుత్వం గత ఏప్రిల్ 16న ఒకటి నుంచి ఐదో తరగతి వరకు హిందీని మూడో భాషగా చేరుస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని మరాఠి, ఇంగ్లీష్ మీడియం స్కూళ్లలో ఇది అమలు కానుందని పేర్కొంది. అయితే దీనిపై రాష్ట్రంలో అన్ని పార్టీల నుంచి నిరసన వ్యక్తమయింది.