07-09-2025 12:50:37 AM
సంగారెడ్డి,(విజయక్రాంతి): సంగారెడ్డి పట్టణంలో వినాయక నిమజ్జనం వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా శ్రీ చైతన్య యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడి లడ్డూను టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కూతురు జయ గణచేతన్య రెడ్డి రూ.18 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. గత సంవత్సరం కంటే ఈసారి లడ్డూ వేలంపాట భారీగా పెరిగిందని నిర్వాహకులు తెలిపారు.
నిమజ్జనంలో పాల్గొన్న జగ్గారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఉత్సాహంగా పాల్గొన్నారు. స్వయంగా ఊరేగింపులో పాల్గొని ట్రాఫిక్ అంతరాయం రాకుండా చర్యలు తీసుకున్నారు. నిమజ్జనం సమయంలో అంబులెన్స్ రాగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. రాధా పట్టణంలో భారీగా వినాయకులు తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.