07-09-2025 12:56:51 AM
కామారెడ్డి, సెప్టెంబర్ 6 (విజయక్రాంతి): బీసీ డిక్లరేషన్ ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ శాసనసభ ఎన్నికల ముందు కామారెడ్డి గడ్డపై ప్రకటన చేయడంతో ఆదివారం కామారెడ్డిలో బీసీ సభ సన్నాక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్క, మరో మంత్రి శ్రీనివాస్ రెడ్డి తదితరులు సన్నాహక సభలో పాల్గొననున్నారు. బీసీ డిక్లరేషన్ ప్రకటించింది.
కామారెడ్డి లో నే కావడంతో అదే గడ్డపై బీసీ లకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ శాసనసభలో తీర్మానం చేసి ఆ ప్రతిని గవర్నర్‌కు ఆమో దం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పంపింది. బిజెపి ప్రభుత్వం కేంద్రంలో బీసీ డిక్లరేషన్ అమలు పరచాలని డిమాండ్ చేస్తున్నారు. దాంట్లో భాగంగా త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలలో కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలప కుండా తెలంగాణ రాష్ర్టంలో మాత్రం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించి ఎన్నికల్లో అవకాశం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు.
దాంట్లో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున కార్గే, తమిళనాడు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఏఐ సీసీ ప్రతినిధి రాహుల్ గాంధీ బీసీ డిక్లరేషన్ సభకు హాజరైన సందర్భంగా కామారెడ్డిలో ఈనెల 15న నిర్వహించనున్న బీసీ సభకు కాంగ్రెస్ ప్రముఖులు హాజర్ అయ్యేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు కృషి చేస్తున్నాయి.