ఐదేండ్లు బీఆర్‌ఎస్‌ను ఆటాడుకుందాం!
గజ్వేల్ సమస్యలను దగ్గరుండీ పరిష్కరిస్తా
ఇక్కడ 25 శాతం మెజార్టీ వస్తే మెదక్‌లో గెలుపే
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
సిద్దిపేట/గజ్వేల్, మే 4: పదేండ్లు మన కార్యకర్తలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టింది.. ఈ ఐదేండ్లు మనం వాళ్లను ఆడుకుందామని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో డీసీసీ అధ్యక్షుడు తూకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా బైక్‌ర్యాలీ నిర్వహించారు. అనంతరం కార్యకర్తల సమావేశంలో మాట్లా డారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు గెలుపునకు కృషిచేయాలని పిలుపునిచ్చారు. గజ్వేల్ లో 25 శాతం మెజార్టీ వస్తే మెదక్‌లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని చెప్పారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మల్లన్నసాగర్ భూనిర్వాసితులు మంచి మెజార్టీ ఇచ్చి గెలిపిస్తే పెండింగ్‌లోని సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గజ్వేల్ సమస్యలన్నీ దగ్గరుండి సీఎం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరి స్తానని భరోసా ఇచ్చారు. రాహుల్‌గాంధీ ప్రధాని కావడమే టార్గెట్‌గా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, మాజీ ఫుడ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్‌రెడ్డి, భూంరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి తదితరులు పాల్గొన్నారు.




