calender_icon.png 11 December, 2025 | 11:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జై సేవాలాల్ ఊరు తండా సర్పంచ్, ఉప సర్పంచ్ ఏకగ్రీవం

11-12-2025 12:02:24 AM

నూతనంగా ఏకగ్రీవమైన సర్పంచ్ ఉప సర్పంచ్లను సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

రాజన్న సిరిసిల్ల, డిసెంబర్ 10(విజయక్రాంతి): వేములవాడ నియోజకవర్గం జై సేవాలాల్ ఊరు తండా గ్రామపంచాయతీ సర్పంచ్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇస్లావత్ మంజుల-రవి,ఉప సర్పంచ్ గా అజ్మీరా దేవా లాల్ నాయక్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఇరువురిని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. విప్ మాట్లాడుతూ.

ఏకగ్రీవం కావడానికి కృషి చేసిన తండా వాసులను అభినందించారు.తండాను అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో తీసుకెళ్లడానికి తన వంతు సహాయం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు.అన్ని ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులకు వారి కేటాయించిన గుర్తులపై అమూల్యమైన ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు..

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని గ్రామాల్లో చేయి తిరిగే వారిని సర్పంచులుగా ఎన్నుకుంటే గ్రామాలు మరింత అభివృద్ధి చెందుతాయని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని తెలిపారు.తను ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో అండగా ఉంటానని తెలిపారు.ప్రతి ఒక్కరు తమ అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల విజయానికి దోహదపడాలని తెలిపారు..