calender_icon.png 11 December, 2025 | 11:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ రిజర్వేషన్స్ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టాలి

11-12-2025 12:03:08 AM

తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్

ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద బీసీల మహాధర్నా

ముషీరాబాద్, డిసెంబర్ 10 (విజయక్రాంతి): బీసీ రిజర్వేషన్ల బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఢిల్లీలోని  జంతర్ మం తర్ వద్ద  తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 42% రిజర్వేషన్ల సాధన కోసం మేకపోతుల నరేందర్ గౌడ్ రాష్ట్ర అధ్యక్షులు తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహాధర్నాను నిర్వహించారు.

ఈ సందర్భంగా మేకపోతుల నరేందర్ గౌడ్ మాట్లాడుతూ  బీసీలకు చట్ట సభల్లో 50% రిజర్వేషన్ల బిల్లును పార్లమెంటులో ప్రవేశ పెట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన బీసీల 42% రిజర్వేషన్ల రెండు బిల్లులను పార్లమెంట్ లో ఆమోదించి 9 వ షెడ్యూల్ చేర్చాలన్నారు. మహిళ రిజర్వేషన్ల బిల్లులో బీసీ మహిళలకు 50% రిజర్వేషన్లు కేటాయించాలని డిమాం డ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ క్యాబినెట్ లో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నారు.

బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు అమలు చెయ్యాలన్నారు. బీసీ విద్యార్థులకు 10కే ర్యాంక్ క్యాప్ విధానాన్ని తొలగించి బీసీ విద్యార్థు పూర్తి ఫీజును ప్రభుత్వమే చెల్లించాలన్నారు.  దేశవ్యాప్తంగా సమగ్ర కులగణనను వెంటనే ప్రారంభించాలన్నారు. ముఖ్యంగా తెలంగాణ జరిగే ఎన్ని కలు బీసీలకు నష్టం చేసే విధంగా ఉన్నాయి కాబట్టి మొన్న హైకోర్టు కొట్టివేసినా సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని మేకపోతుల నరేం దర్ గౌడ్ తెలిపారు.

జాతీయ బీసీ మేధావుల సంఘం అధ్యక్షుడు ఆళ్ల రామకృష్ణ మాట్లాడుతూ మన దేశంలో బీసీలలంటే  పాలకులకు పార్టీలకు అసలు లేక్కలేదని అసహనం వ్యక్తం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ ర్యాగా అరుణ్ కుమార్ మాట్లాడుతు దేశంలోఉన్న అత్యధిక జనాభా కలిగిన బీసీలు బాగుపడకుండా దేశం బాగుపడదు అని అన్నారు.

ఈ కార్యక్రమంలో బొల్లం లింగ మూర్తి పటేల్, వర్కింగ్  ప్రెసిడెంట్, ఎర్ర శ్రీహరి ఉపాధ్యక్షులు, గిరగాని భిక్షపతి గౌడ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తవతం సత్యనారాయణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, పెంట అజయ్ పటేల్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు, అది మల్లేశం పటేల్ కరీంనగర్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు  స్వరూప జాతీయ బీసీ సంక్షేమ సంఘం కరీంనగర్ జిల్లా అధ్యక్షురాలు, తదితరులు పాల్గొన్నారు.