4 August, 2026 | 4:19 PM

ఆగస్టు 10 జైల్ భరోను విజయవంతం చేయాలి

04-08-2026 02:41 PM

– సీఐటీయూ జిల్లా కార్యదర్శి సాయిలు

హత్నూర: దేశవ్యాప్తంగా ఆగస్టు 10న నిర్వహించే జైల్ భరో కార్యక్రమాన్ని కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి. సాయిలు పిలుపునిచ్చారు.

హత్నూర మండలం దౌల్తాబాద్‌లో సీఐటీయూ ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించిన ఆయన మాట్లాడుతూ, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలని, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలకు నష్టకరంగా ఉన్నాయని విమర్శించారు.