26-07-2025 01:17:06 AM
హెచ్‌ఎండీఏ ప్రణాళికా చర్యల అధ్యయనం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): జైపూర్ డెవలప్‌మెంట్ అథారిటీ బృందం శుక్రవారం కమిషనర్ ఆనంది నేతృత్వంలో శుక్రవారం హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని సందర్శించింది. హెచ్ ఎండీఏ ప్రణాళికా కార్యక్రమాలు, మెట్రోపాలిటన్ అభివృద్ధిలో అనుసరిస్తున్న ఉత్తమ చర్యలను అధ్యయనం చేసింది. ఈ బృం దంలో ప్లానింగ్ డైరెక్టర్ ప్రీతి గుప్తా, అదనపు చీఫ్ టౌన్ ప్లానర్ అంకుర్ దధీ, అసిస్టెంట్ టౌన్ ప్లానర్ రుషికేష్ కొల్టే పాల్గొన్నారు.
అమీర్‌పేటలోని హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయంలో మెట్రోపాలిటన్ కమిషనర్ సర్ఫ రాజ్ అహ్మద్, ఇతర సీనియర్ అధికారులు ఈ ప్రతినిధి బృందానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సర్ఫరాజ్ అహ్మద్ హెచ్‌ఎండీఏ అభివృద్ధిపై సమగ్ర సమీక్షా ప్రజెంటేషన్ ఇచ్చారు. మా స్టర్ ప్లాన్లు, రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్లు, ల్యాండ్ పూలింగ్ పథకాలు, హైదరాబాద్ మెట్రోపాలిటన్ ప్రాం తం కోసం రూపొందిం చిన సమగ్ర మాస్టర్ ప్లాన్‌ను వివరించారు.
హెచ్‌ఎండీఏ ప్రణాళిక, సాంకేతిక చర్యలను జేడీఏ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా మెచ్చుకొని, అందించిన వివరాలపై కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ స మావేశంలో హెఎండీఏ స భ్యుడు ఎస్ దేవేందర్‌రెడ్డి, ప్లానింగ్ డైరెక్టర్లు కె విద్యాధర్, ఎం.రాజేంద్ర ప్రసాద్ నాయక్ పాల్గొన్నారు.