26-07-2025 01:15:11 AM
32 ఏళ్ల రోగికి ‘పీవోఈఎం’ ప్రక్రియ విజయవంతం
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 25 (విజయక్రాంతి): నిజాంపేట్‌లోని శ్రీశ్రీ హోలి స్టిక్ హాస్పిటల్స్ ఇటీవల 32 ఏళ్ల మహిళకు అరుదైన అన్నవాహిక సమస్యకు మినిమల్లీ ఇన్వాసివ్ పెరోరల్ ఎండోస్కోపిక్ మయోటమీ (పీవోఈఎం) ప్రక్రియ ద్వారా విజయ వంతమైన చికిత్స అందించింది. నిజాంపేట్‌కు చెందిన కృష్ణవేణి గత కొన్ని నెలలుగా భోజనం తర్వాత తీవ్రమైన వాం తులతో బాధపడుతున్నారు.
వైద్య పరీక్షల తర్వాత అచలాసియా కార్డియా అనే అరుదైన అన్నవాహిక కదలికల రుగ్మతగా నిర్ధారించారు. అనేక హాస్పిటల్స్‌ను సంప్రదించినా ఉపశమనం లేకపోవడంతో ఆమె శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్‌ను సంప్రదించారు. ఆమెను ఎండోస్కోపిక్, కొలనోస్కోపిక్ చికిత్సల్లో నిపుణులైన డాక్టర్ డి శ్రీనివాసులు (కన్సల్టెంట్ ఇన్ గ్యా స్ట్రోఎంటరాలజీ) పరీక్షించారు. పీవోఈఎం ప్రక్రియ ద్వారా నయం చేయొచ్చని గుర్తించారు.
ఇది ఎండోస్కోప్ ద్వారా పూర్తిగా నిర్వ హించబడే కోతలేని పద్ధతి. ఈ ప్రక్రియలో అన్నవాహికలోని లోపలి కండరాలపై నియంత్రిత మయోటమి చేయడం ద్వారా అన్న వాహిక ఒత్తిడిని తగ్గించి, మింగే ప్రక్రియను సులభతరం చేస్తారు. ఈ ప్రక్రియ విజయవంతంగా పూర్తయ్యింది. కృష్ణవేణి రెండు రోజు ల్లోనే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం ఎటువంటి అసౌకర్యం లేకుండా సాధారణ ఆహారపు అలవాట్లకు మళ్లీ అలవాటుపడుతున్నారు.