31-08-2025 12:38:06 AM
రియాసి జిల్లాలో ఏడుగురు, రాంబన్ జిల్లాలో నలుగురు మృతి
శ్రీనగర్, ఆగస్టు 30: జమ్మూకశ్మీర్‌ను మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఈ భారీ వర్షాలు, కొండచరియల వల్ల రాష్ట్రవ్యాప్తంగా 11 మంది మృతి చెందారు. మృతుల్లో ఐదుగురు చిన్నారులు ఉన్నారు. భారీ వర్షాల ధాటికి కొండచరియలు విరిగిపడటంతో ఒకే కుటుంబంలోని ఏడుగురు మరణించారు. రాంబన్ జిల్లాతో పాటు రియాసి జిల్లా కూడా వరదల ధాటికి అతలాకుతలం అయింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రియాసి జిల్లాలోని మహోర్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. వరదల వల్ల పలువురి ఇండ్లు కొట్టుకుపోయాయి.