calender_icon.png 1 September, 2025 | 2:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంజిన్‌లో మంటలు.. విమానం అత్యవసర ల్యాండింగ్

31-08-2025 11:03:45 AM

న్యూఢిల్లీ: ఇండోర్‌ కు వెళ్తున్న ఎయిర్ ఇండియా(Air India) విమానం ఆదివారం దేశ రాజధానిలో అత్యవసరంగా ల్యాండ్ చేశారు. విమానం కుడి ఇంజిన్‌లో పైలట్‌కు "ఫైర్ సిగ్నల్" అందడంతో విమానం 30 నిమిషాలకు పైగా గాల్లోనే ఎగిరిన తర్వాత అత్యవసరంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా సంస్థ తెలిపింది. A320 నియో విమానంలోని ఒక ఇంజిన్‌ ను ఆపివేసి, విమానం ఢిల్లీ విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్ అయ్యిందని ఎయిర్ ఇండియా పేర్కొంది. ఉదయం 6:15 గంటల ప్రాంతంలో విమానం అత్యవసరంగా ల్యాండ్ అయిందని, విమానంలో 90 మందికి పైగా ఉన్నారని సంస్థ తెలిపింది. 

AI2913 విమానాన్ని తనిఖీ కోసం నిలిపివేశారు. "ఆగస్టు 31న ఢిల్లీ నుండి ఇండోర్‌కు నడుస్తున్న AI2913 విమానం, కాక్‌పిట్ సిబ్బందికి కుడి ఇంజిన్‌లో ఫైర్ సిగ్నల్ సంకేతాన్ని అందడంతో, టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఢిల్లీకి తిరిగి వచ్చింది" అని టాటా గ్రూప్ యాజమాన్యంలోని ఎయిర్‌ లైన్ వివరాలను తెలిపింది. ప్రామాణిక విధానాన్ని అనుసరించి, కాక్‌పిట్ సిబ్బంది ఇంజిన్‌ను ఆపివేయాలని ఎంచుకుని ఢిల్లీకి తిరిగి వచ్చారు.. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయిందని ఎయిర్ ఇండియా తెలిపింది. కాగా, ఇటీవల కాలంలో ఎయిర్ ఇండియా విమానాలు సాంకేతిక సమస్యలను ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.