7 August, 2026 | 2:31 AM

పెండింగ్ బకాయిలు విడుదల చేయాలి

07-08-2026 12:00 AM

జనసేన పార్టీ రాష్ట్ర ఇన్చార్జి నేమూరి శంకర్ గౌడ్

ఇందిరా పార్కు ధర్నా చౌక్‌లో జనసేన విద్యార్థి పోరు దీక్ష

హాజరైన వందలాది విద్యార్థులు 

ముషీరాబాద్,ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, ఇతర పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర ఇన్చార్జ్ నేమూరి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు. జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ ఆధ్వర్యంలో గురువారం ఇందిరా పార్కు ధర్నా చౌక్లో నిర్వహించిన జనసేన విద్యార్థి పోరు దీక్షలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ విద్యాసంస్థలు విద్యార్థుల సర్టిఫికెట్లు నిలిపివేసి ఒత్తిడి చేయడాన్ని ప్రభుత్వం అరికట్టాలని కోరారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని విమర్శించారు. జనసేన ప్రచార కార్యదర్శి సాగర్ ఆర్.కె. నాయుడు మాట్లాడుతూ విద్యార్థుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణలో ఫీజు రీయిం బర్స్మెంట్ కూడా సక్రమంగా అందించలేకపోవడం దురదృష్టకరమన్నారు.

జనసేన విద్యార్థి విభాగం నాయకుడు మిరియాల రామకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాశాఖ నిర్వహణలో విఫలమయ్యారని ఆరోపిస్తూ జీ.ఓ. నెం.09ను పకడ్బందీగా అమలు చేసి పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఓయూ జేఏసీ నాయకుడు సంపత్ నాయక్ విద్యార్థుల న్యాయమైన డిమాండ్లకు జనసేన అండగా ఉంటుందని తెలిపారు. దీక్ష ప్రారంభానికి ముందు ప్రొఫెసర్ కె. జయశంకర్, ప్రజా యుద్ధనౌక గద్దర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

కార్యక్రమంలో జనసేన రాష్ట్ర మీడియా కో ఆర్డినేటర్ దుంపటి శ్రీనివాస్, రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్, దామోదర్ రెడ్డి, మేకల సతీష్ రెడ్డి, ప్రజీత్ గౌడ్, సురేష్ రెడ్డి, నందగిరి సతీష్, కత్తి సైదులు, మేడ రామకృష్ణ, ప్రేమ్ గాంధీ, విద్యార్థి విభాగం నాయకులు మహేష్ పెంట ల, మొకురాల కృష్ణ, ఆరని గౌతమ్, వినోద్ నాయక్, తాళ్లూరి కౌశిక్, మాదాసు శివ, పి. రాజకుమార్, ప్రశాంత్ రెడ్డి, భరద్వాజ్, పి. అక్షయ్, అక్షయ్ రెడ్డి, వీర మహిళలు రత్నా పిల్ల, లిఖిత, వెంకట లక్ష్మి, పద్మజ, అనుపమ, వివిధ విశ్వవిద్యాలయాల విద్యార్థులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.