06-09-2025 12:00:00 AM
జనగామ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఎన్‌ఏఎస్ అమలులో దేశ వ్యాప్తంగా.. తెలుగు రాష్ట్రాల నుండి ఒక్క జనగామ జిల్లా టాప్ 50 లో చోటు సంపాదించుకునేలా దిశా నిర్దేశం చేసినందుకు ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి చేతుల మీదుగా జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ,
అదనపు కలెక్టర్, డి. ఈ. ఓ పింకేష్ కుమార్ అవార్డు అందుకున్నారు. ఈ సందర్బంగా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.. ఈ అవార్డు రావడం వెనుక ప్రతీ ఉపాధ్యాయుల, విద్యార్థినీ విద్యార్థుల కృషి అలాగే వారి తల్లిదండ్రుల ప్రోత్సాహం ఉందని తెలిపారు. మున్ముందు విద్యారంగంలో జనగామ జిల్లా మరిన్ని అంశాలలో ఉన్నత స్థానాల్లో నిలబడేలా అందరూ సహకరించాలన్నారు.