06-09-2025 12:00:00 AM
మరిపెడ, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): గణేష్ చతుర్థి వేడుకల్లో మహబూబాబాద్ జిల్లా మరిపెడ పట్టణంలోని సీతారామాంజనేయ ఆలయంలో మట్టి వినాయకున్ని ప్రతిష్టించి పూజలు నిర్వహించారు. శుక్రవారం గణపతి మండపంలో నిర్వహించిన లడ్డును వేలంపాటలో పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు ఏడిఎంఎస్ ఎలక్ట్రిక్ బైక్ షోరూం యజమాని రహీమ్ మెదటి లడ్డు వేలం పాటలో పాల్గొని 45,116 రూపాయలకు గణనాథుని లడ్డూను దక్కించుకున్నారు.
ఈ సంఘటనతో వినాయక చవితి వేడుకలు కుల,మత సామరస్యతకు ప్రతీకగా నిలవడంతో పలువురి ప్రశంసలు అందుకున్నారు. భగవంతుడు సర్వాంతర్యామి అని మరోసారి రుజువైందని పట్టణవాసులు ఆనందం వ్యక్తం చేశారు.
గణనాథుడి లడ్డు పొందిన మాజీ సర్పంచ్ శ్రీను..
మహబూబాబాద్, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా కేసముద్రం పట్టణంలో శ్రీ వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ 16వ గణేష్ నవరాత్రి ఉత్సవాల 9 కిలోల తాపేశ్వరం లడ్డుకు వేలంపాట నిర్వహించారు.
గురువారం అర్ధరాత్రి వరకు హోరాహోరీగా జరిగిన లడ్డు వేలంపాటలో మాజీ సర్పంచ్ బట్టు శ్రీను 2,36,116 రూపాయలకు వేలంలో పాట పాడి గణనాథుడి లడ్డును దక్కించుకున్నారు. వరసిద్ధి వినాయక ఉత్సవ కమిటీ ప్రతినిధులు లడ్డు దక్కించుకున్న బట్టు శ్రీనును సన్మానించి, భాజా భజంత్రీల మధ్య లడ్డును అందజేశారు.