06-09-2025 12:00:00 AM
కలెక్టర్ దివాకర టీఎస్
ములుగు, సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) :క్రీస్తు శేషులు మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జయంతి సందర్భంగా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవంను పురస్కరించుకొని ములుగు జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో గురుపూజోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ సిద్ధార్థరెడ్డి అధ్యక్షత వహించగా, జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ ముఖ్య అతిథిగా ములుగు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీమతి రేగ కళ్యాణి మరియు అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) సంపత్ రావు ప్రత్యేక అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు భావితరాల నిర్మాతలు. వారి చేతుల్లోనే విద్యార్థుల భవిష్యత్తు, సమాజ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మంచి సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు నైతిక విలువలతో కూడిన విద్యను విద్యార్థులకు అందించాలి అని పేర్కొన్నారు మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి మాట్లాడుతూగిరిజన ప్రాంతమైన ములుగు జిల్లాలో అధిక సంఖ్యలో గిరిజన విద్యార్థులు చదువుతున్నారు.
ఇక్కడ సేవలందిస్తున్న ఉపాధ్యాయుల కృషి ప్రశంసనీయము. విద్యార్థుల అభివృద్ధి కోసం ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలి అని అన్నారు అనంతరం ములుగు జిల్లాలో 33 మంది ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని అతిథుల చేతుల మీదుగా సన్మానించారు.
చింతపల్లి ఆశ్రమ పాఠశాలలో..
వెంకటాపురం (నూగూరు), సెప్టెంబర్ 5 (విజయక్రాంతి) : ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు మండలంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక చింతపల్లి ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా వరంగల్ లోని మామనూరు పోలీస్ ట్రైనింగ్ క్యాంపులో ట్రైనర్ గా ప్రభుత్వం నిర్వహిస్తున్న పాయం సురేష్ ను ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా చిరుతపల్లి ఆశ్రమ పాఠశాల సిబ్బంది సన్మానించారు.
ప్రాంతంలో విద్యాభ్యాసం చేసి పోలీస్ ట్రైనింగ్ గ్యాప్ లో గత 15 సంవత్సరాలుగా విధులు నిర్వహిస్తున్న సురేష్ను ఈ సందర్భంగా అభినందిస్తూ శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిట్టి బాబురావు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.