06-09-2025 12:20:33 AM
కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ కీలక పాత్ర పోషించిన కన్నడ చిత్రం ‘వీర చంద్రహాస’. ఇందులో ఇంకా శిథిల్ శెట్టి, నాగశ్రీ జీఎస్, ప్రసన్న శెట్టిగార్ మందార్తి, ఉదయ్ కడబాల్, రవీంద్ర దేవాడిగ, నాగరాజ్ సర్వెగర్, గుణశ్రీ ఎం నాయక్, శ్రీధర్ కాసర్కోడు, శ్వేత అరెహోల్, ప్రజ్వల్ కిన్నాల్ ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడ అగ్ర నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ సమర్పణలో ఓంకార్ మూవీస్ బ్యానర్‌పై ఎన్‌ఎస్ రాజ్‌కుమార్ నిర్మించారు. ‘
కేజీఎఫ్’, ‘సలార్’ లాంటి యాక్షన్ చిత్రాలకు సంగీత సారథ్యం వహించిన మ్యూజిక్ డైరెక్టర్ రవి బస్రూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. కన్నడలో విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీన్ని ఇప్పుడు తెలుగులో కంచి కామాక్షి కోల్‌కతా కాళీ క్రియేషన్స్ బ్యానర్‌పై ఎమ్‌వీ రాధాకృష్ణ విడుదల చేస్తున్నారు. సెప్టెంబర్ 19న ఈ చిత్రం విడుదల కానున్నట్టు నిర్మాత అధికారికంగా వెల్లడించారు.