జయశంకర్ సేవలు చిరస్మరణీయం
07-08-2026 12:01 AM
న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి
ముషీరాబాద్, ఆగస్టు 6 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో ప్రొఫెసర్ జయశంకర్ సార్ సేవలు చిరస్మరణీయమని తెలంగాణ న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ పులిగారి గోవర్ధన్ రెడ్డి కొనియాడారు. తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కె. జయశంకర్ జయంతి సందర్భంగా గురువారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రొఫెసర్ కె. జయశంకర్ చేసిన త్యాగాలు, కృషి చిరస్మరణీయమని కొనియాడారు.






