calender_icon.png 27 September, 2025 | 2:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏసీబీ వలలో మేడ్చల్ టౌన్ ప్లానింగ్ ఆఫీసర్

27-09-2025 01:48:13 PM

హైదరాబాద్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో అవినీతి టౌన్ ప్లానింగ్ అధికారి(Medchal Town Planning Officer) ఏసీబీకి చిక్కాడు. ఎల్లంపేట్ మున్సిపల్ ఆఫీసులో లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు(ACB net) పట్టుబడ్డాడు. టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణరెడ్డి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. వెంచర్ కు అనుమతి కోసం అధికారి రూ. 5 లక్షలు లంచం డిమాండ్ చేశారు. శనివారం నాడు రూ. 3.50 లక్షలు తీసుకుంటుండగా రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు అవినీతి అధికారిని అదుపులోకి తీసుకున్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి రాధాకృష్ణ ఇప్పటికే రూ. లక్ష అడ్వాన్స్ గా తీసుకున్నాడు. రాధాకృష్ణరెడ్డి ఇల్లు, కార్యాలయంలో సోదాలు చేస్తున్నట్లు ఏసీబీ అధికారులు  వెల్లడించారు.