05-11-2025 12:00:00 AM
ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025
ముంబై, నవంబర్ 4 : త్వరలో జరగనున్న ఆసియాకప్ రైజింగ్ స్టార్స్ 2025 టోర్నీ కోసం భారత్ ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. యువ వికెట్ కీపర్ జితేశ్ శర్మను కెప్టెన్‌గా ఎంపిక చేసింది.గత కొంతకాలంగా దేశవాళీ క్రికెట్, ఐపీఎల్‌తో పాటు జాతీయ జట్టులోనూ జితేశ్ శర్మ అద్భుతంగా రాణిస్తున్నాడు. ఐపీఎల్ 2025 లోనూ పరుగుల వరద పారించాడు. ప్రస్తు తం టీ20 ఫార్మాట్‌లో ఫినిషర్ రోల్‌లో పలుసార్లు కీలకంగా ఉన్నాడు. ఇటీవల ఆసీస్‌పై మూడో టీ ట్వంటీలో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
దీంతో బీసీసీఐ అత నికి ప్రమోషన్ ఇచ్చింది. నమన్ ధీర్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. ఈ జట్టు లో యువ సంచలనం 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ, ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన ప్రియాన్ష్ ఆర్య, రమణ్‌దీప్‌సింగ్, సుయాష్ శర్మ వంటి ప్లేయర్స్ చోటు దక్కించుకున్నారు. ఆంధ్రా యువక్రికెటర్ షేక్ రషీద్ స్టాండ్ బై ప్లేయర్స్ జాబితాలో ఎంపికయ్యాడు. ఆసియాకప్ రైటింగ్ స్టార్స్ టోర్నీ నవంబర్ 14 నుంచి ఖతార్ వేదికగా జరగనుంది.
ఈ టోర్నీలో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆప్ఘనిస్తాన్, శ్రీలంక ఏ జట్లతో పాటు యూఏఈ, ఒమన్, హాంకాంగ్ జట్లు బరిలోకి దిగుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో జరగనున్న ఈ టోర్నీలో భారత్, పాక్ , యూఏఈ, ఒమన్ గ్రూప్ బీలో ఉండగా... గ్రూప్ ఏలో శ్రీలంక, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్, హాంకాంగ్ చోటు దక్కించుకున్నాయి. ఒకే గ్రూప్‌లో ఉండడంతో భారత్, పాక్ ఏ జట్లు తలపడడం ఖాయమైంది.