05-11-2025 12:00:00 AM
దుబాయి, నవంబర్ 4 : పాకిస్థాన్ ఫాస్ట్ బౌలర్ హ్యారిస్ రవూఫ్‌కు ఐసీసీ దిమ్మతిరిగే షాకిచ్చింది. ఆసియాకప్ సందర్భంగా గ్రౌండ్‌లో ఓవ రాక్షన్ చేసినందుకు 2 మ్యాచ్‌ల నిషేధం విధించింది. భారత్‌తో మ్యాచ్‌లో రవూఫ్ రూల్స్ ఉల్లంఘిస్తూ ఓపెనర్లు గిల్, అభిషేక్ శర్మలపై నోరు పారేసుకున్నాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. దీంతో అతడి మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు. అలాగే మరోసారి కూడా రవూఫ్ వివాదాస్పద రీతి లో ప్రవర్తించాడు.
బౌండరీ లైన్ దగ్గర అభిమానులు కోహ్లీ..కోహ్లీ అని అరుస్తుండగా రవూఫ్ భారత్‌కు చెందిన రఫెల్ జెట్ ఫ్లుట్సైను కూల్చామంటూ 6 పేర్కొంటూ చేతితో సైగలు చేశాడు. దీనిపై భార త్ అప్పుడే ఫిర్యాదు చేయగా విచారణ జరిపిన ఐసీసీ అతనిపై చర్యలు తీసుకుంది. ఇదిలా ఉంటే భారత టీ ట్వంటీ జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌పైనా ఐసీసీ చర్యలు తీసుకుంది. ఐసీసీ నిబంధనలు అతిక్రమించినందుకు గానూ సూర్య మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమా నా, రెండు డీమెరిట్ పాయింట్లు విధించింది. అలాగే రవూఫ్ సైగలకు కౌంటర్‌గా విమా నం కూలినట్టు సైగలు చేసిన భారత పేసర్ బుమ్రాను కూడా ఐసీసీ మందలించింది. ఈ టోర్నీలో భారత్, పాక్ మ్యాచ్‌లలోనే ఇ లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. దీం తో ఐసీసీ వీటిని సీరియస్‌గా తీసుకుంది.