calender_icon.png 7 November, 2025 | 10:07 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిగ్‌బాష్ లీగ్ నుంచి అశ్విన్ ఔట్

05-11-2025 12:00:00 AM

సిడ్నీ, నవంబర్ 4 : టీమిండియా మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బిగ్‌బాష్ లీగ్ నుంచి తప్పుకున్నాడు. గాయం కారణంగా ఈ లీగ్ నుంచి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. ఇటీవలే ఐపీఎల్‌కు వీడ్కోలు పలికిన అశ్విన్ ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో ఏ లీగ్స్‌లోనైనా ఆడొచ్చు. ఈ క్రమంలోనే ఇటీవల బిగ్‌బాష్ లీగ్ సిడ్నీ థండర్స్ ఫ్రాంచైజీతో అ శ్విన్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే చెన్నైలో ఒక యాడ్ షూటింగ్ సందర్భంగా అశ్విన్ మోకాలికి గాయమైంది. వైద్యులు రెండు నెలలు విశ్రాంతి సూచించడంతో లీగ్ నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడు. అటు సిడ్నీ థండర్స్ ఫ్రాంచైజీ యాజమా న్యం కూడా ఈ విషయాన్ని ధృవీకరించింది.