3 July, 2026 | 1:06 AM

లంచానికి ఉద్యోగాలు!

03-07-2026 12:00 AM
  1. అయోధ్య విరాళాల చోరీ కేసులో మరో అవినీతి
  2. ఉద్యోగ నియామకాల్లో అవకతవకలు

లక్నో, జూలై2: అయోద్య రామమందిరం విరాళాల చోరీ కేసులో మరో అక్రమం వెలుగులోకి వచ్చింది. లంచాలు తీసుకుని కొందరికి ఉద్యోగాలు ఇచ్చినట్లు దర్యాప్తు బృందం గుర్తించింది. ఆలయంలో వివిధ పోస్టులకు డబ్బులు తీసుకుని నియామకాలు చేశారని నిందితుడు అవినాశ్ శుక్లా వెల్లడించినట్లు పోలీసు వర్గాల సమాచారం. దీంతో ఇప్పుడు ట్రస్ట్ సభ్యల్లో కీలకమైన వారిని ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి.

ఆలయంలో దాదాపు 125 మందిని వివిధ పోస్టుల్లో నియమించారు. వీరిలో కొందరి వద్ద నుంచి సొమ్ము వసూలు చేసినట్లు స మాచారం. ఇప్పటి వరకూ ఆలయంలో ఉద్యోగుల అపాయింట్‌మెంట్ లెటర్లు, ఫార్మల్ సర్వీస్ అగ్రిమెంట్లు ఇతర పత్రాలు ఏవీ కూడా పోలీసులకు అందలేదు. దీంతో ఎవరెవరి వద్ద లంచాలు తీసుకున్నారని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.