3 July, 2026 | 1:07 AM

కీవ్‌పై రష్యా భీకర దాడులు

03-07-2026 12:00 AM
  1.   74 క్షిపణులు, 496 డ్రోన్ల ప్రయోగం
  2.   18 మంది దుర్మరణం, 90 మందికి పైగా గాయాలు
  3. భూగర్భ ప్రాంతాల్లోకి ప్రజల పరుగులు

కీవ్, జూలై 2: రష్యా చమురు కేంద్రాలపై ఉక్రెయిన్ జరిపిన దాడులకు ప్రతీకారంగా, రష్యా ఉక్రెయిన్ రాజధాని కీవ్‌పై బుధవారం రాత్రంతా 11 గంటల పాటు డ్రోన్, క్షిపణులతో విరుచుకుపడింది. 74 క్షిపణులు, 496 డ్రోన్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నగరంలో ఏడేళ్ల బాలిక సహా 18 మంది పౌరులు మరణించారు. 90 మందికి పైగా గాయపడ్డారు.

అధికారులు వైమానిక దాడుల హెచ్చరికలు జారీ చేయడంతో, రాత్రిపూట గంటల తరబడి ఉక్రెయిన్ రాజధానిలో భారీ పేలుళ్లు సంభవించాయి. చాలా మంది భూగర్భ ప్రాంతాల్లోకి వెళ్లి తలదాచుకున్నారు. తెల్లవారినప్ప టికీ కూలిపోయి, కాలిపోయిన అపార్ట్మెంట్ భవనాల శిథిలాల కింద బాధితుల కోసం అత్యవసర సిబ్బంది వెతుకుతూనే ఉన్నారు. 

ఉక్రెయిన్ సుదూర దాడులకు ప్రతిస్పందనగా ఈ ఘోరమైన బాంబు దాడి జరిగిందని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. కీవ్ నగరంలో ఇది ఒక ‘భయానక రాత్రి’ అని ఉక్రెయిన్ అగ్రశ్రేణి దౌత్యవేత్త పేర్కొన్నారు.-------------ఈ దాడుల్లో కీవ్‌లో 18 మంది మరణించారని అత్యవసర సేవల విభాగం తెలిపింది. 90 మందికి పైగా గాయపడ్డారని కీవ్ మేయర్ విటాలి క్లిటోష్క్ తెలిపారు.  రష్యా కీవ్ నగరంపై జరిపిన దాడిని జర్మనీ సహా పలు దేశాలు ఖండించాయి.