calender_icon.png 21 January, 2026 | 11:11 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు ఇవ్వాలి

21-01-2026 12:00:00 AM

కళాకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతాం

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య

కళాకారుల సమస్యలను విస్మరించిన బీఆర్‌ఎస్, కాంగ్రెస్

జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్

కళాకారులను విస్మరించడం సిగ్గుచేటు

అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క

ఇందిరాపార్క్ ధర్నా చౌక్‌లో తెలంగాణ ఉద్యమ కళాకారుల పోరుదీక్షలో వక్తలు

ముషీరాబాద్, జనవరి 20 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారధిలో అర్హులైన కళాకారులకు ఉద్యోగాలు వెంటనే ఇవ్వాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షు డు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కళాకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుంటే రాష్ట్ర వ్యా ప్తంగా కళాకారులతో పెద్ద ఎత్తున ఉద్యమా న్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం తెలంగాణ ఉద్య మ కారుల సంఘం అధ్యక్షుడు దరువు ఆం జన్న ఆధ్వర్యంలో ఇందిరాపార్కు ధర్నా చౌక్‌లో తెలంగాణ ఉద్యమ కళాకారుల న్యా యమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కళాకారులు పోరుదీక్షను చేపట్టారు.

ఈ పోరు దీక్ష కార్యక్రమానికి జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య, బీసీ సంక్షేమ సం ఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్, అరుణోదయ సాంస్కృతిక శాఖ సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ప్రవీణ్ మార్ లతో కలిసి మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ తెలంగాణ సాంస్కృతిక సారధిలో వెయ్యి ఉద్యో గాలను సాధించుకునే దిశగా కళాకారులు పోరాటాలు చేయాలని పిలుపునిచ్చారు.

తెలంగాణ సాంస్కృతిక సారథిని ఏర్పాటు చేసి కేవలం 550 ఉద్యోగాలు మాత్రమే ఇచ్చి గత ప్రభుత్వం చేతులు దులుపుకుందని ఆయన ఆరోపించారు. సాంస్కృతిక సారధిగా చైర్మన్‌గా ఉన్న అప్పటి రసమయి బాలకిషన్ తన అనుయాయులకే ఉద్యోగాలు ఇచ్చి అర్హులైన కళాకారులకు మొండి చేయి చూపించారని ఆయన మండిపడ్డారు. 12 సంవత్సరాలుగా పేదరికంలో మగ్గుతూ ఉపాధిలేక కనీస జీవనోపాది కరువై కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితిలో మగ్గుతున్నారని అన్నారు. వెం టనే కళాకారులకు ఉద్యోగాలు కల్పించి న్యా యం చేయాలని లేని పక్షంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ఆయన హెచ్చరించారు.

అనంతరం బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రధసారదులైన ఉద్యమ కళాకారులను గత బీఆర్ ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం వారి సంక్షేమాన్ని విస్మరించిందన్నారు. టీపీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డికి గతంలో కళాకారుల బాదలు, గోసలు వివరించామని, సీఎం అయిన తరువాత సీఎం రేవంత్ రెడ్డి కూడా అర్హులైన కళాకారులను పట్టించుకోకపోవడం దారుణమన్నారు. కళాకారుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకపోతే గతంలో బీఆర్‌ఎస్ కు పట్టిన గతే కాంగ్రెస్ పార్టీకి పడుతుందని ఆయన హెచ్చరించారు. విమలక్క మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ముందుండి కొట్లాడిన కళాకారుల బాధలు, వెతలను ప్రభు త్వం పట్టించుకోకపోవడం సిగ్గుచేటన్నారు. కళాకారుల ఆట పాట ద్వారా తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని అలాంటి కళాకారులను ప్రభుత్వం విస్మరించడం హాస్యాస్ప దమన్నారు.

అనంతరం తెలంగాణ ఉద్యమ కళాకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దరు వు అంజన్న మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యమంలో పనిచేసి ఇంటి స్థలం లేని నిరుపేద కళాకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. కళాకారులను ప్రభుత్వం గుర్తించి గుర్తింపు కార్డులతో పాటు ఉచిత రవాణా సౌకర్యాలు కల్పించాలన్నారు. కళాకారులకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని అన్నారు. పదిలక్షల ఆరోగ్య భద్రత ఉచిత హెల్త్ కార్డులు అందజేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్ర మంలో సంఘం నాయకులు రవికుమార్, అరువురి వెంకన్న కిరణ్, మోహన్ బైరాగి, తాడూరి శ్రీకాంత్, రామలింగం, వెంకటాచారి, చుక్క రామనర్సయ్య, శ్రీకాంత చారి తల్లి శంకరమ్మ, పుష్పలత, రమ, కవిత, నర్మద తదితరులు పాల్గొన్నారు.