23-12-2025 09:34:53 PM
ఎస్బిఐ వరంగల్ రూరల్ ఏజియం ఏఎన్ వి.సుబ్బారావు
రేగొండ,(విజయక్రాంతి): రైతుల ఎదుగుదలకు ఎస్బిఐ బ్యాంక్ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని ఎస్బిఐ బ్యాంక్ వరంగల్ రూరల్ ఏజిఎం ఏఎన్ వి.సుబ్బారావు అన్నారు. మంగళవారం ప్రపంచ రైతు దినోత్సవ సందర్భంగా ఎస్బిఐ ఆధ్వర్యంలో అన్నదాత ఉత్సవం కార్యక్రమాన్ని రేగొండ మండలం రేపాక రైతు వేదికలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్.వి సుబ్బారావు మాట్లాడుతూ రైతులు అధునాతన టెక్నాలజీ వైపు అడుగులు వేసి వ్యవసాయాన్ని వృద్ధి చేసుకోవాలని కోరారు.
వ్యవసాయంలో ముఖ్యంగా డ్రోన్ స్ప్రేయర్, హార్వెస్టర్, సోలార్ వంటి పరికరాలను పిఎంజిఈపి స్కీం ద్వారా అందిపుచ్చుకొని రైతులు లాభాల బాటలో సాగాలని ఆయన పేర్కొన్నారు.రైతులు రుణాల విషయంలో నిర్ణీత సమయంలోగా చెల్లింపు చేసుకోవాలని గత పది సంవత్సరాలుగా లోన్ తీసుకొని సరైన సమయంలో రెన్యువల్ చేసుకున్న ఐదుగురు రైతులను బ్యాంకు సిబ్బంది సన్మానించారు.ఈ కార్యక్రమంలో పరకాల ఎస్బిఐ ఏసిబి చీఫ్ మేనేజర్ రవి, డిప్యూటీ మేనేజర్ శ్రీనివాస్, ఫీల్డ్ ఆఫీసర్ నిఖిల్, సి ఎస్ పి పాయింట్ నిర్వాహకులు మడప మమత, సంపత్ రెడ్డి, భూపాలపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గూటోజు కిష్టయ్య, గ్రామ సర్పంచ్ గుల్ల స్వప్న తిరుపతి, ఉప సర్పంచ్ వెంగల నరసయ్య, మాజీ సర్పంచ్ పోనగంటి తిరుపతి, రైతులు పాల్గొన్నారు.