22-10-2025 04:12:43 PM
హనుమకొండ,(విజయక్రాంతి): అంబేద్కర్ సర్కిల్, హెడ్ పోస్ట్ ఆఫీస్ ఎదురుగా హైడ్రా కమిషనర్ ఐపీఎస్ అధికారి ఏవి రంగనాథ్ జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి.గతంలో వరంగల్ పోలీస్ కమిషనర్ గా పని చేసిన సమయంలో కబ్జా రాయుల్ల నుండి పేదవారి భూములను రక్షించి వారికి న్యాయం చేసినందుకు గాను వారి సేవలను గుర్తుంచుకుంటూ హన్మకొండ జూలైవాడకు చెందిన బూర సన్నీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి కాజీపేట ట్రాఫిక్ ఎస్ఐ శ్రావణ్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి, పండ్లు పంపిణీ చేసి, సంబరాలు జరుపుకున్నారు.
అనంతరం సుమారు 200 మంది మున్సిపల్ కార్మికులకు వచ్చే చలి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని, ఉన్ని దుస్తులను పంపిణీ చేశారు. సాధారణంగా రాజకీయ నాయకులు లేదా సినీ నటుల జన్మదిన వేడుకలను జరుపుకునే ప్రజలు వరంగల్ పోలీస్ కమిషనర్ గా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన కమిషనర్ రంగనాథ్ ను గుర్తుపెట్టుకుని జన్మదిన వేడుకలను జరుపుకోవడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేశాయి.