29-12-2025 08:41:10 PM
- ఇండ్ల మధ్యలో ఉన్న రైస్ మిల్లు తొలగించాలి
- బంగారం గ్రామస్తుల వినతి
కొండపాక: జనావాసాల మధ్య రైస్ మిల్ ఉండడంతో ప్రజలు నానా ఇబ్బందులకు గురవుతున్నారని వెంటనే దానిని తొలగించి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని కొండపాక మండలం బందారం గ్రామానికి చెందిన పలువురు జిల్లా కలెక్టర్ కు ప్రజావాణిలో దరఖాస్తు చేశారు. సుమారు 30 సంవత్సరాల క్రితం చిన్న గిర్నిగా ప్రారంభించి ఇప్పుడు అది పెద్ద రైస్ మిల్లు గా మారిందని ఎలాంటి అనుమతులు లేకుండా కొనసాగిస్తూ ప్రజలు నివసిస్తున్న ఇండ్ల మధ్యలో రైస్ మిల్లు నిర్వహిస్తున్నారని దానివల్ల దుమ్ము దూళి ఇళ్లలోకి రావడంతో శ్వాస కోశ వ్యాధులకు గురై అనారోగ్యాల పాలవుతున్నామని పేర్కొన్నారు. గతంలో పలుమార్లు ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్న ఎలాంటి చర్యలు తీసుకోలేదని వెంటనే రైస్ మిల్లు మూసివేసి ప్రజల ఆరోగ్యాలను కాపాడాలని గ్రామస్తులు కోరారు.