calender_icon.png 16 October, 2025 | 5:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్ బీజేపీ అభ్యర్థి దీపక్‌రెడ్డి

16-10-2025 02:02:23 AM

హైదరాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్ని కకు అభ్యర్థిని బీజేపీ అధిష్ఠానం ఎట్టకేలకు ప్రకటించింది. లంకల దీపక్‌రెడ్డి పేరును ఖరారు చేసింది.  బీఆర్‌ఎస్ అభ్యర్థిగా మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత, కాంగ్రెస్ అభ్యర్థిగా నవీన్‌యాదవ్ బరిలో నిలుస్తుండగా, బీజేపీ అభ్యర్థిగా దీపక్‌రెడ్డి పోటీ చేయనున్నారు. 2023 ఎన్నికల్లోనూ దీపక్‌రెడ్డి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయన హైదరాబాద్ సెంట్రల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.