16-10-2025 02:01:16 AM
దేవరకొండ, అక్టోబర్ 15: నల్గొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా బుధవారం దేవరకొండ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో నిర్వహించిన సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమంలో ఏఐసీసీ సెక్రటరీ మరియు ఏఐసీసీ పరిశీలకులు బిశ్వాత్ రాజా మహతి,ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయక్ తో కలిసి దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొన్నారు.
అనంతరం ఎమ్మెల్యే బాలునాయక్ మాట్లాడుతూ ఈ సంఘటన్ సృజన్ అభియాన్ కార్యక్రమం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. నూతన జిల్లా అధ్యక్షుల ఎన్నికపై పార్టీ నాయకులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకూ బలోపేతమవుతోందని తెలిపారు.పార్టీ నాయకులు, కార్యకర్తలు సమష్ఠిగా పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నియోజక వర్గ ముఖ్య నాయకులు, వివిధ అనుబంధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.