calender_icon.png 16 November, 2025 | 10:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంత్రి శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్

16-11-2025 08:21:11 PM

మంథని (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా నూతనంగా ఎన్నికైన నవీన్ యాదవ్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబును ఆదివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. నూతనంగా ఎమ్మెల్యేగా ఎన్నికైన నవీన్ యాదవ్ ను మంత్రి అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. ప్రాంత అభివృద్ధి, ఐటీ రంగ విస్తరణ, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంపై ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ, ప్రజల సంక్షేమం కోసం మరింత కృషి చేస్తామని తెలిపారు. జూబ్లీహిల్స్ అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ మాట్లాడతూ మంత్రి నాయకత్వంలో రాష్ట్ర ఐటీ రంగాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నియోజకవర్గ ప్రజల అభ్యున్నతికి మంత్రి సూచనల మేరకు కృషి చేస్తానని అన్నారు.