21-11-2025 12:00:00 AM
-రెండో టెస్టుకు భారత కెప్టెన్ దూరం!
-11 ఏళ్ల తర్వాత కెప్టెన్‌గా కీపర్
గుహావటి, నవంబర్ 20 : సౌతాఫ్రికాతో రెండో టెస్టుకు ముందు ఊహించినట్టుగానే భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ శుభమన్ గిల్ గుహావటి వేదికగా జరగబోయే మ్యాచ్‌లో ఆడే అవకాశాలు కనిపించడం లేదు. బీసీసీఐ ఇంకా అధికారికంగా ప్రకటించకున్నప్పటకీ వరుస సిరీస్‌ల దృష్ట్యా గిల్ విషయంలో ఎలాంటి రిస్క్ తీసుకోకూడదని టీమ్ మేనేజ్‌మెంట్ నిర్ణయించింది.
దీంతో గిల్ రెండో టెస్టులో ఆడడం దాదాపుగా అసాధ్యమే. ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన తొలి టెస్ట్ సందర్భంగా గిల్ మెడనొప్పితో తీవ్రం గా ఇబ్బందిపడ్డాడు. బ్యాటింగ్ చేస్తుండగా నొప్పితో విలవిలలాడిన గిల్ మధ్యలోనే మ్యాచ్ నుంచి తప్పుకున్నా డు. తర్వాత స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు వెళ్ళడం, ఒకరోజంతా ఐసీయూలో ఉండ డంతో టెన్షన్ నెలకొంది.
తర్వాతి రోజు డిశ్చార్జ్ అయినప్పటకీ మెడనొప్పి నుంచి ఇంకా కోలుకోలేదు. తాజాగా జట్టుతో గుహావటికి వచ్చిన భారత సారథి విశ్రాంతికే పరిమితమయ్యాడు. దీం తో బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ గిల్ పరిస్థితిపై అప్‌డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం బీసీసీఐ మెడికల్ టీమ్ పర్యవేక్షణలో గిల్ కోలుకుంటున్నాడని, అతను రెండో టెస్ట్ ఆడాలా ? వద్దా ? అనేది మ్యాచ్‌కు ముందురోజు నిర్ణయిస్తామన్నాడు. ఒకవేళ నొప్పి రాకుంటే బరిలోకి దిగే అవకాశమున్నా ఫిజియో, మెడికల్ టీమ్ నిర్ణయంపైనే ఆధారపడి ఉం టుందని చెప్పాడు.
అతను రెండో టెస్ట్ ఆడాలనే కోరుకుంటున్నట్టు వ్యాఖ్యానించాడు. ఇదిలా ఉంటే గిల్ దూరమైతే అతని స్థానం లో సాయి సుదర్శన్ జట్టులోకి రానున్నట్టు తెలుస్తోంది. గత మ్యాచ్‌లో సాయి సుదర్శన్‌ను పక్కన పెట్టిన కోచ్ గంభీర్ మూడో స్థానంలో వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాడు. ఈ నిర్ణయం పై విమర్శలు కూడా వచ్చాయి. టెస్టుల్లో ఎంతో కీలకమైన మూడో స్థానంతో ఎక్కువ ప్రయోగాలు చే యొద్దని పలువురు మాజీలు సూచించారు. దీంతో రెం డో టెస్టుకు ఆ ప్లేస్‌లో సాయి సుదర్శన్‌నే ఆడించే ఛాన్సుంది. అదే సమయంలో గిల్ బ్యాటింగ్ ప్లేస్‌లో ధృవ్ జురెల్‌ను ఆడించే అవకాశముందని బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ చెప్పాడు.ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నప్పటకీ సితాన్షు జురెల్ పేరునే ప్రస్తావించాడు.
దీనికి కూడా కారణముంది. ఇటీవల దేశవాళీ క్రికెట్‌లో జురెల్ అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. సౌతాఫ్రికా ఏ జట్టుతో జరిగిన అనధికార టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ అతను సెంచరీలు బాదాడు. ఈ కారణంగానే తుది జట్టులో పంత్ ఉన్నప్పటకీ స్పెష లిస్ట్ బ్యాటర్‌గా జురెల్‌ను తీసుకున్నారు. ఇప్పుడు రెండో టెస్టుకు గిల్ దూరమవడం ఖాయమైన నేపథ్యంలో నాలుగో స్థానంలో జురెల్‌నే ఆడించబోతున్నారు.
పంత్ సరికొత్త చరిత్ర
ఇదిలా ఉంటే రెండో స్థానంలో టీమిండియాను వికెట్ కీపర్ రిషబ్ పంత్ నడిపిం చబోతున్నాడు. ప్రస్తుతం వైస్ కెప్టెన్‌గా ఉన్న పంత్ ఈ మ్యాచ్‌తో అరుదైన ఘనతను అం దుకోనున్నాడు. ధోనీ తర్వాత భారత టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు తీసుకోనున్న రెండో వికె ట్ కీపర్‌గా చరిత్ర సృష్టిస్తాడు. 2014 వరకూ ధోనీ భారత్ టెస్ట్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. సుధీర్ఘ ఫార్మాట్‌లో భారత్‌కు సారథ్యం వహించిన ఏకైక కీపర్ ధోనీనే. ఇప్పుడు గిల్ దూరమవుతున్న నేపథ్యంలో పంత్ కూడా ధోనీ సరసన చేరనున్నాడు. ఇక శనివారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్ట్ కోసం టీమిండియా ముమ్మరంగా సాధన చేస్తోంది. సిరీస్ చేజారకుండా ఉండాలంటే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచి తీరాలి. ఒకవేళ డ్రాగా ముగిసినా కూడా సౌతాఫ్రికా 1 సిరీస్‌ను సొంతం చేసుకుంటుంది.