calender_icon.png 21 November, 2025 | 10:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి నుంచే యాషెస్ సిరీస్

21-11-2025 12:00:00 AM

-గాయాలతో ఆసీస్ సతమతం

-చరిత్ర సృష్టిస్తామంటున్న స్టోక్స్

పెర్త్, నవంబర్ 20 : ప్రపంచ క్రికెట్‌లో యాషెస్ సిరీస్‌కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 143 ఏళ్లుగా జరుగుతు న్న ఈ సిరీస్ అంటే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు ప్రాణం పెడతాయి. వరల్డ్ కప్ గెలవకున్నా పర్లేదు యాషెస్ గెలిస్తే చాలనుకుం టాయి. అందుకే ఐసీసీ టోర్నీలు, ఐపీఎల్ వంటి లీగ్స్‌కు కూడా దూరమైన ఆయా జట్ల ప్లేయర్స్ యాషెస్ కోసమే సన్నద్ధమవుతుంటారు. అలాంటి ప్రతిష్టాత్మక సిరీస్ ఇప్పుడు మళ్లీ వచ్చేసింది.

ఈ సారి ఆసీస్ గడ్డపై జరగనున్న యాషెస్ సిరీస్‌కు శుక్రవారమే తెర లేవబోతోంది. ఐదు టెస్టుల సిరీస్‌లో భాగం గా తొలి టెస్ట్ పెర్త్ వేదికగా జరగనుంది. మరోసారి యాషెస్ టైటిల్ నిలబెట్టుకోవాలని కంగారూలు భావిస్తుండగా.. ఈ సారి ఎలాగైనా ఆసీస్ గడ్డపై చరిత్ర సృష్టించాలని ఇంగ్లాండ్ పట్టుదలగా ఉంది. కాగా తొలి టెస్ట్ కోసం రెండు రోజుల ముందే ఇంగ్లాండ్ 12 మందితో తమ తుది జట్టును ప్రకటించింది. పిచ్ కండీషన్స్‌ను బట్టి మ్యాచ్‌కు ముందు 11 మందిపై నిర్ణయం తీసుకోనున్నారు.

కోచ్‌గా బ్రెండన్ మెక్‌కల్లమ్ బాధ్య తలు చేపట్టినప్పటి నుంచీ ఇంగ్లాండ్ టెస్టుల్లోనూ దూకుడుగా ఆడుతోంది. వరుస పరాజయాలు ఎదురైనా కూడా తగ్గేదే లేదం టూ బజ్‌బాల్ వ్యూహంతోనే ముందుకెళుతోంది. ప్రస్తుత యాషెస్ సిరీస్‌లోనూ బజ్ బాల్ స్ట్రాటజీనే కొనసాగించబోతోంది. మరోవైపు ఆస్ట్రేలియా కూడా తమ తుది జట్టును ప్రకటించంది. గాయాల కారణంగా స్టార్ పేసర్లు హ్యాజిల్‌వుడ్, కమ్మిన్స్ దూరమవడం కంగారూలకు ఇబ్బందే అయినప్పటకీ ఇద్దరు కొత్త ప్లేయర్స్ అరంగేట్రం చేస్తున్నా రు.

దేశవాళీ క్రికెట్‌లో అదరగొట్టిన ఓపెనర్ జేక్ వెదరాల్డ్, పేసర్ బ్రెండన్ డాగెట్ చోటు దక్కించుకున్నారు. గాయం నుంచి కోలుకున్న కామెరూన్ గ్రీన్ కూడా జట్టులోకి వ చ్చాడు. కమ్మిన్స్ లేకపోవడంతో స్టీవ్ స్మిత్ కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు.