25-10-2025 12:00:00 AM
అది 2019వ సంవత్సరం. ‘గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్’ ఆధ్వర్యంలో గిడుగు వారి పేరు మీద తెలుగు సాహిత్యంలో కొంతమంది ప్రముఖులను గుర్తించి పురస్కారాలిచ్చే కార్య క్రమం హైదరాబాదులోని ‘సుందరయ్య విజ్ఞాన కేంద్రం’లో జరిగింది. అట్టి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్ బి. చంద్రకుమార్ గారి చేతుల మీదుగా నేను ‘జీవన సాఫల్య పురస్కారం’ అందుకున్నాను.
ఆనాటి నుంచి నేటి దాకా చంద్ర కుమార్ గారితో గొప్ప సాహిత్యానుబం ధం ఏర్పడింది. వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి వారు చేస్తున్న కృషి నన్ను ఆకర్షిం చింది. కేవలం వారి రచనలు ఇతరులు చదవడానికి మాత్రమే పనికి వచ్చేవి కావు. వారి జీవితానుభవాలను, వ్యక్తిత్వ పరిమళాలను, సేవా దృష్టిని, న్యాయ సంబంధ మైన తీర్పులను వెల్లడించే వారి రచనలను చదవడమంటే నాకిష్టం.
వారి రచనలను, సామాజిక ఉద్యమ కార్యక్రమాలను చూ స్తూ ఉంటే వారి ఉన్నతాశయాలు, ఆదర్శప్రాయమైన వ్యక్తిత్వం నాకు అడుగడుగున అగుపించాయి. చంద్రకుమార్ గారు భక్తి పరంగా చూస్తే గొప్ప సాయి భక్తులు. సా మాజికంగా చూస్తే గొప్ప మానవతామూ ర్తి.
న్యాయవాద వృత్తిలో తీర్పుల విషయం లో ఆయనెన్నడూ ధర్మానికి విరుద్ధంగా వ్యవహరించలేదు. అట్లే ఆయన రచనలను చదివినప్పుడు ఆయన బహుము ఖీనమైన ప్రజ్ఞతో పాటు లోకానుభవం వ్యక్తమవుతోంది.
వెలకట్టలేని స్నేహం
చంద్రకుమార్‌గారితో నాకు ఏర్పడిన స్నేహానుబంధం వెల కట్టలేనిది. నేను 2022లో పత్రికల్లో వచ్చిన నా ఆధ్మాత్మిక వ్యాసాలను ‘హృదయ కమలం’ పేరుతో అచ్చువేశాను. ఈ వ్యాస సంపుటి హిందీ లో అనువదించిన వారు దవనపల్లి వెంకటేశ్ గారు, మహారాష్ర్ట వాస్తవ్యులు. పత్రి కల్లో ప్రచురితమవుతున్నప్పుడే నా వ్యా సాలను చూసి హిందీలో అనువదిస్తే బా గుంటుందని, ఆ పని చేశారు.
ఐతే దాన్ని ముద్రించాలనుకున్నప్పుడు, ఆ వ్యాసాల ను లోగడ చదివిన జస్టిస్ చంద్రకుమార్ గారు నాకు గుర్తుకువచ్చారు. వారికి అనువాదం విషయం తెలియజేసి, అచ్చు వే యాలనుకుంటున్నానని తెలియచేశాను. వెంటనే ఆలస్యం చేయకుండా ‘హృదయ కమలం’ హిందీలో అచ్చు కావడానికి పదివేల రూపాయలను పంపించారు. నా కెం తో ఆశ్చర్యం కలిగింది.
తోటి రచయితలం టే వారికి ఎంత గౌరవం, ప్రేమనో అర్థమైంది. భగవద్గీతలో ‘పరస్పరం భావ యంతం’ అనే మాట కృష్ణుని నోట వినిపిస్తుంది. నిజమే, ఆయా రంగాల్లో ఉన్న వా ళ్లు పరస్పరం సహకరించుకుంటే వారి మ ధ్య స్నేహం కలకాలం నిలిచి ఉంటుంది కదా!
బహు గ్రంథకర్తలు
చంద్రకుమార్ గారు బహు గ్రంథకర్తలు. సాయి భక్తులైన వీరికి సమాజ మం టే అంతులేని ప్రేమ. విద్యార్థుల కోసం, యువతీ యువకుల కోసం, గృహస్థుల కోసం, మేధావుల కోసం, మొత్తం సమా జం కోసం వీరు రచించిన గ్రంథాలు అవశ్యపఠనీయమనక తప్పదు. ‘వినరా కుమారా! వివరించినే చెబుతా’ అనే గ్రం థం పెడమార్గంలో ప్రయాణిస్తున్న యువతకు దిక్సూచి లాంటిది.
‘వట్టిమాటలు కట్టి పెట్టి పట్టుదల చూపించు! గట్టి ఫలితమే సాధించు’ అని యువతను ఉత్సాహపరిచారు ఈ గ్రంథంలో. ‘నా కలంలో ఇంకై పోయింది’ అనే మరో కవితా సంపుటిలో ‘కన్నీళ్లను కాగితం మీద పెట్టాలనుకుంటే నా కలంలో ఇంకైపోయింది’ అని చంద్రకుమార్ అన్నారు కాని, ఆయన సమాజం లోని బాధలకు గురౌతున్న అన్నార్తుల కన్నీళ్లను తుడవడానికే కలం పట్టినారనిపిస్తుంది నాకు.
‘ఉన్నత లక్ష్యం- ప్రగతికి మా ర్గం’ అనే వ్యాస సంపుటి- విద్యార్థుల విషయంలో తల్లిదండ్రుల బాధ్యతను గుర్తు చేస్తుంది. అధ్యాపకుల కర్తృత్వాన్ని తెలియజేస్తుంది. స్వాతంత్య్ర సమరవీరులను స్మృ తికి తెస్తుంది. సామాన్యుల హక్కుల పరిరక్షణ విషయంలో న్యాయస్థానాలు తీసు కోవలసిన జాగ్రత్తలను నిర్దేశిస్తుంది. మత సామరస్యాన్ని ప్రబోధిస్తుంది. స్త్రీల పట్ల వివక్షతను గర్హి స్తుంది. ఎన్నో సమస్యలు న్నా వాటికి పరిష్కార మార్గాలను సూచిస్తుంది.
బాధ్యత గుర్తొచ్చేలా
ప్రతి పౌరునికి తన బాధ్యతను గుర్తుచేసే గ్రంథమే ‘ఉన్నత లక్ష్యం- ప్రగతికి మా ర్గం’, అందరి సృష్టి- విశ్వం ఒక్కటే’ అనే వ్యాససంపుటి ‘రామాయణం సూచించే జీవన విధానాలను’ తెలియజేస్తుంది, నడుస్తున్న చరిత్రలో ఏ మతం ఎట్లా వచ్చిందో సహేతుకంగా వివరింపబడింది. మతసామరస్యమే మానవాళికి క్షేమంకరమని ఈ గ్రంథం వేనోళ్ల చాటుతుంది. ఇది స్ఫూర్తిదాయకమైన గ్రంథం.
‘నీవు మాకు ఆద ర్శం’ అనే కవితా సంపుటి వైవిధ్యం గల అంశాలతో పాఠకుల్ని ఆలోచనాపరుల్ని చేస్తుంది. అంతర్నేత్రాన్ని తెరిచేలా చేస్తుం ది. అడవిలోని వృక్షాన్ని ఆదర్శంగా తీసుకున్నా, ప్రతి నాగరికుడు తప్పక బాగుప డతాడని గొప్ప సందేశాన్నిస్తుంది. ఈ కవి తా సంపుటిలోని కవితా పంక్తులు రచన పరమ లక్ష్యాన్ని తెలుపుతున్నాయి.
‘సాహిత్యమంటే ఆలోచింపజేయాలి
ఆనందింపజేయాలి అనురాగం
కల్గించాలి.. ఆవేశం రగిలించాలి
అవసరమైతే పిడికిలి బిగించడం నేర్పించాలి’
సాహిత్యమే ఆయుధంగా
సమాజాన్ని మార్చే ప్రయత్నంలో సాహిత్యాన్ని ఆయుధంగా మార్చుకొమ్మని చెప్పిన కవి చంద్రకుమార్ గారు. ‘ఎవరు నాకు తోడు’ అనే కవితా సంపుటిలో జస్టిస్ చంద్రకుమార్ గారు సామా న్యులకు, వారి సమస్యల పరిష్కారానికి తోడుగా నిలిచిన మానవతామూర్తిగా కనిపిస్తారు. ‘అందరి మూలం ఒక్కటే. అందరి ప్రాణం ఒక్కటే’ అని ఉపనిషత్తుల సారాన్ని గుర్తుచేస్తారు. ‘గతం ద్వేషం పెంచితే, దాన్ని బొందపెట్టు’ అని ఆవేశానికి లోనవుతారు.
వర్తమానంలో జీవించడమే మనుష్య జీవితానికి పరమార్థమని, మానవత్వమంతటా పరిఢవిల్లాలని ఆకాంక్షిస్తారు. అసలైన విశ్వమే మనకు తోడని చెప్పడం ఇందులోని సారాంశం. ఈ కవితా సంపుటిలోని ‘ఎవరు భారత పౌరు లు’ అనే ఒక్క కవిత చాలు- చంద్రకుమార్ గారు మానవత్వం మూర్తీభవించిన కవి అనడానికి. చంద్రకుమార్ గారు న్యాయమూర్తిగా ఎన్నో అను భవాలను కలిగి ఉన్నారు.
వాటిని కవితాబద్ధం చేసి ఒక విధంగా పాఠకుల హృద యాలకు చేరువయ్యారు. అట్లే తన చిన్ననాటి జ్ఞాపకాలను ‘అమ్మా నాన్న’ అనే పుస్తకంలో పొందుపరిచారు. తమ అమ్మానాన్నల నుంచి పొందిన స్ఫూర్తి వల్లనే తనింత వాడినయ్యానని చెప్పుకొన్న చంద్రకుమార్ గారు అందరికీ ఆదర్శమయ్యారు.
వ్యాసకర్త సెల్: 9885654381