calender_icon.png 29 October, 2025 | 12:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరి పేదరికం మాటేమిటీ?

25-10-2025 12:00:00 AM

భారత్‌లో కేంద్ర ప్రభుత్వం అవలంబించిన వ్యవసాయ, ఆర్థిక ప్రణాళిక, పారిశ్రామిక పెట్టుబడి, ఉత్పత్తి, మార్కెటింగ్, సమాచారం, విదేశీ వర్తకం, సాంకేతిక పరిజ్ఞాన విధానాల వల్ల ధనికులు మరింత ధనవంతులవుతుంటే.. పేదరికంలో ఉన్నవారు మరింత పేదరికంలోకి కూరుకుపోతున్నారు. ప్రస్తుతం ప్ర పంచంలో జీడీపీ పరంగా నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న భారత్ 2030 నాటికి మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుందని ‘ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్’ సంస్థ తాజాగా ప్రకటన విడుదల చేసింది.

4.19 ట్రిలియన్ లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న భారత దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 2046 నాటికి 8 రెట్ల కు పెరుగుతుందని చెప్పడం గొప్ప విషయమే. అయితే దేశంలో ఇప్పటికీ అట్ట డుగు స్థాయిలో జీవిస్తున్న పేదల సంఖ్య తగ్గకపోవడమనేది ఆలోచించాల్సిన అం శం. ఇటీవలే ఐక్యరాజ్యసమితి పేదరికం ఎక్కువగా ఉన్న దేశాల జాబితాను విడుదల చేసింది.

అయితే ఈ జాబితాలో భారత్ స్థానం మెరుగ్గా ఉన్నప్పటికీ దేశం లో పేదల జనాభా తగ్గుదలలో మాత్రం పెద్దగా మార్పు కనపడలేదు. ఐక్యరాజ్యసమితి ప్రకారం భారత్‌లో ఇప్పటికీ 23.4 కోట్ల మంది పేదరికంలో మగ్గుతున్నారని తమ అధ్యయనంలో తేలిందని పేర్కొంది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ అగ్రభాగంలో ఉన్నప్పటికీ పేదరికం అనే అం శం దానికి అడుగడుగునా అడ్డుపడుతుందనేది కాదనలేని వాస్తవం.

ప్రజల ఆదా యాలు, జీవన ప్రమాణాలే మెరుగుదల అభివృద్ధికి సరైన కొలమాణాలు. జీడీపీలో ఉన్నత స్థాయికి చేరుకుంటున్న భా రత్ తలసరి ఆదాయం పరంగా మాత్రం 140 దేశాల కన్నా దిగువన ఉంది. ఆక్స్‌ఫా మ్ నివేదిక ప్రకారం దేశ జనాభాలో ఒక శాతం వర్గం చేతుల్లోనే 40 శాతం దేశ సం పద కేంద్రీకృతమై ఉందని, ఆర్థిక ప్రగతితో ప్రజ్వరిల్లుతున్నప్పటికీ, ఆర్థిక అసమానతలు పేదరికాన్ని రూపుమపడంలో విఫల మవుతున్నాయి. 

సంపదంతా ఒక్క శాతం వద్దే

సమాజంలో ఉన్నత వర్గాల సంపద ఆదాయం పెరుగుతూ ఉంటే దిగువ శ్రేణి లో వున్న వారి పరిస్థితి నానాటికి దిగజారిపోతుంది. మన దేశంలో రోజుకు 70 మంది కొత్తగా మిలియనీర్లు పుట్టుకొస్తున్నారు. దేశంలో ఉత్పత్తి చేయబడిన 73 శాతం వస్తువుల్లో ఒక్క శాతం ఉన్న అత్యం త ధనవంతుల వద్దకే ఇది ఎక్కువగా చేరుతున్నట్లు ఆర్థిక నిపుణులు అభిప్రాయప డుతున్నారు.

అయితే దేశంలో 670 మిలియన్ పేదల సంపదలో కేవలం ఒక్క శా తం మాత్రమే పెరుగుదలను సూచించడం గమనార్హం. జీడీపీ పరంగా అమెరికా, చైనా, జర్మనీ తర్వాత నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్నప్పటికీ ప్ర జల ఆదాయాల సంపద, ఆర్థిక వ్యత్యాసా లు పెరుగుతూనే వస్తున్నాయి. ఇటీవల హురూన్ ఇండియా రిచ్‌లిస్ట్ సంస్థ దేశం లో అత్యంత సంపన్నుల జాబితాను విడుదల చేసింది.

జూలై 31 నాటికి దేశంలో కుబేరుల సంఖ్య 1539కి పెరిగింది. వీరి వద్ద పోగైన సంపద విలువ దాదాపు రూ. 159 లక్షల కోట్లుగా ఉంది. అంతేకాదు వీరి ఆస్తులు ఈ ఏడాది 46 శాతం వృద్ధి చెం దాయి. మరి జీడీపీ పరంగా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్న దేశంలో పేదరికం అలాగే ఉండడానికి ఒక్క శాతం బిలీయనర్ల సంపదే కారణమా అనే అనుమానం రాక మానదు.

ఎందుకంటే దేశంలో ఒక్క శాతమున్న అత్యంత ధనవంతుల వద్దే 40.01 శాతం సంపద కేంద్రీకృతమై ఉండడమే ఇందుకు నిదర్శనం. దీనికి కారణం  కేంద్ర ప్రభుత్వం అనుసరించిన 1991 ఆర్థి క సంస్కరణలే అని చెప్పొచ్చు. 1991కి ముందు మన దేశ జీడీపీ 3 శాతం వృద్ధితోనే ఆగిపోయింది. సంస్కరణల తర్వాత మన దేశ జీడీపీలో 68 శాతం వృద్ధి రేటు పెరగడం కనిపించింది. అయితే ఇదే సమయంలో అతి తక్కువ శాతం ఉన్న జనాభా వద్ద మాత్రమే సంపద గరిష్ఠంగా పెరుగు తూ వచ్చింది. ఆర్థిక అంతరాలు తగ్గించే చర్యలను ప్రభుత్వం తీసుకోలేదు.

ఆర్థిక వ్యవస్థలో ఉపాధి రహిత ఉత్పత్తి ఉత్పాదకత పెరిగి ఆర్థిక, ఆదాయ అసమానతలను తీవ్రతరం చేశాయి. అయితే దేశంలో గణనీయమైన అభివృద్ధి వల్ల సుమారు 25 కోట్ల మంది కఠిన పేదరికం నుంచి విముక్తి పొందారని నీతి ఆయోగ్ ప్రకటించింది. కేవలం ఐదు శాతం కంటే తక్కువ మంది భారతీయులు మాత్రమే పేదరికంలో ఉన్నారని నీతి ఆయోగ్ సీఈవో పేర్కొన్నారు. మరోవైపు 81 కోట్ల మంది ప్రజలకు ప్రభుత్వమే ఉచితంగా ఆహార ధాన్యాలను పంపిణీ చేస్తుంది. అయితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం, రాబడి లెక్కల మీద ఆధారపడి పేదరికాన్ని లెక్కిం చడం సరైన పద్ధతి కాదు. 

పెరుగుతున్న ఆర్థిక భారం

పేద వర్గాల ప్రజలు ప్రభుత్వ ఆసు పత్రుల్లో కనీస  వైద్య సేవలు అందుబాటు లో లేకపోవడంతో ప్రైవేటు కార్పొరేట్ ఆ సుపత్రులను ఆశ్రయిస్తున్నారు. అక్కడ ఖ రీదైన ఖర్చులు భరించలేక అప్పులపాలై ఆర్థిక భారాన్ని మోయలేక ఉన్న ఆస్తులను అమ్ముకొని వారంతా మరింత పేదరికానికి నెట్టివేయబడుతున్నారు. అధికారంలో ఉ న్న ప్రభుత్వాలు ప్రైవేటు పరమైన అభివృద్ధిని పక్కనబెట్టి ముందు ప్రభుత్వ ఆసు పత్రుల్లో సరైన మౌలిక వసతులు ఏర్పా టు చేసి పేదలకు వైద్యం అందిస్తేనే పేదరికాన్ని జయించినట్లవుతుంది.

దేశంలో 15 నుంచి 49 ఏళ్ల వయసు ఉన్న స్త్రీలలో 57 శాతం, పురుషుల్లో 25 శాతం రక్త హీనత తో బాధపడుతున్నారని జాతీయ కు టుంబ ఆరోగ్య సర్వే పేర్కొంది. ఐదేళ్ల్ల లో పు పిల్లల్లో పౌష్టికాహార లోపంతో ఎదుగుదల లోపించింది. మానవ వనరుల అభి వృద్ధిలో ఆశించిన మేర ప్రగతి కనిపించ డం లేదు. ఐక్యరాజ్యసమితి జన సంక్షేమానికి 17 సుస్థిరాభివృద్ది లక్ష్యాలను నిర్దే శించింది.

ఆ లక్ష్యాల సాధనలో భారత్ ఇప్పటికీ వెనుకబడి ఉంది. పెరుగుతున్న వినియోగ వ్య యానికి తగినట్లుగా ఆదాయాలు పెరగడం లేదు. అనేక కుటుంబా లు అప్పుల ఊబిలోకి కూరుకుపోతున్నా యి. వ్యవసాయ రంగంలో పెట్టుబడికి తగిన గిట్టుబాటు లేక రైతులు వ్యవసాయ రంగం నుంచి నిష్ర్కమించి పట్టణాలకు వలసలు పోతున్నారు. కష్టపడి పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక, మధ్యవర్తుల దళారీల మోసాలకు బలై ఆర్థికంగా చితికిపోతున్నారు.

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టికి ఆర్థిక స్వాలంభనకు ఆయువు పట్టుగా నిలిచే చేతి వృత్తుల ఉత్పత్తులకు గిరాకీ తగ్గడం వల్ల కునారిల్లుతున్నాయి. ప్రభుత్వం చేతివృత్తుల ఆధునికీకరణకు సహాయం అందించి శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తే వారి జీవితాల్లో ఆర్థిక వెలుగులు చూసే అవకాశముంటుంది.

యవతలో నైపుణ్యలేమి

దేశ జనాభాలో 60 శాతం ఉన్న యువతలో చదువుకు తగిన నైపుణ్యాలు లేవు. ఉపాధి పొందే స్థితిలో లేకపోవడం వల్ల నిరుద్యోగం శాపంగా పరిణమించింది. ప్రభుత్వం విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు ‘ఎర్న్ వైల్ లెర్న్’ విద్యా విధానాన్ని అమలు చెయ్యాల్సిన అవసరముంది. చ దువుకునే రోజుల్లో విద్యార్థుల్లో పని పట్ల శ్రద్ధాసక్తులు పెంచి స్వశక్తితో స్వయం ఉపా ధి అవకాశాలు కల్పించుకునే పరిస్థితులు కల్పించాలి.

దేశంలో లభించే సహజ వనరుల అభిలాషణీయ వినియోగానికి ప్రభు త్వాలు పెద్ద పీట వేయాలి.  పేదరికం, నిరుద్యోగం, ఆర్థిక అసమానతలు, లింగ వివక్ష, అసమానతల కట్టడికి కృషి చే యాలి. విద్య, వైద్య, పోషకాహార సౌకర్యా ల కల్పన పరంగా బడ్జెట్‌లో ఎక్కువ ని ధులు కేటాయించాలి.

యువత నైపుణ్యాభివృద్ధి పెంచుకునేలా, మహిళా సాధికారితకు సంక్షేమ కార్యక్రమాలు సమర్థంగా అమ లు చేయాల్సిన అవసరముంది. ప్రజ ల తలసరి ఆదాయాల పెరుగుదలతో మె రుగైన మానవ వనరుల అభివృద్ధికి ప్రా ధా న్యత ప్రజ్వరిల్లినప్పుడే 2030 నాటికి భా రత్ కలల కంటున్నట్లుగా ప్రపంచంలో మూడో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశించవచ్చు.

వ్యాసకర్త సెల్: 9440245771