29-10-2025 08:58:32 PM
మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి..
మేడిపల్లి (విజయక్రాంతి): పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా, ఈరోజు సాయంత్రము పీర్జాదిగూడలోని శ్రీ చైతన్య బాలికల జూనియర్ కాలేజీలో సుమారు 500 మంది విద్యార్థులతో క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. శ్రీ చైతన్య కాలేజీ నుండి ప్రారంభమైన క్యాండిల్ ర్యాలీ గ్లోబల్ స్కూల్ వరకు నిర్వహించారు. విద్యార్థులు దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించి, నివాళిలు అర్పించారు.
ఈ సందర్భంగా మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి మాట్లాడుతూ “పోలీస్ అమరవీరులు తమ ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం చేసిన త్యాగాలు ఎప్పటికీ మరువలేనివి, స్మరించుకోవడం మన అందరి బాధ్యత” అని పేర్కొన్నారు. విద్యార్థులు తొందరపడి చెడు నిర్ణయాలు తీసుకోవద్దు, ఏదైనా ఎదుర్కునే దైర్యం, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి ఇన్స్పెక్టర్ గోవింద రెడ్డి, సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ సిబ్బంది, స్కూల్ యాజమాన్యం, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.