29-10-2025 09:05:33 PM
ఇబ్రహీంపట్నం: ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. పలుచోట్ల రోడ్లు, పంట పొలాలు జలమయంగా మారాయి. దీంతో చెరువులు, కుంటలు నిండుకుండల్లా సంతరించుకుంటున్నాయి. పట్నం పెద్ద చెరువులోకి రాచకాలువ, పోచారం పెద్ద కత్వ ఉధృతంగా ప్రవహిస్తున్నది. మరోసారి ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు తొందరలోనే అలుగు దూకెందుకు అవకాశం కనిపిస్తోంది. అదే జరిగితే భూగర్భ జలాలు పెరిగి, సమీప ప్రాంతాల్లోనీ రైతులకు కొన్ని ఏళ్ల పాటు నీటికొరత లేకుండా మేలు చేకూరనుంది.