calender_icon.png 30 October, 2025 | 10:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీలు ఐక్యంగా ఉద్యమిస్తేనే

25-10-2025 12:00:00 AM

ఇవాళ అన్ని పార్టీల్లో ఉన్న బీసీ సోదరులందరూ రోడ్లపైకి వచ్చి తమ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ సహా అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నాయి. మరి బీసీ సోదరులంతా తమ 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం ఎవరిపైన నిరసన వ్యక్తం చేస్తున్నారనేది అర్థం కాని విషయం. బీసీలకు అన్యాయం ఎప్పటి నుంచి జరుగుతుందనేది ఒకసారి పరిశీలిస్తే.. 1953లో కాకా కాలేకర్ కమిషన్‌ను అమలు చేయకుండా బీసీలను అప్పటి కాంగ్రెస్ మోసం చేసింది. ఆర్టికల్ 340 ద్వారా మండల్ కమిషన్ వేస్తే దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్రను చేసింది.

అయితే కమండల్ యాత్రను ఆపి బీసీల బతుకులకు భరోసా ఇచ్చి మండల్ కమిషన్‌ను అమలు చేయించారు మాన్యశ్రీ కాన్షీరాం. ‘మండల్ కమిషన్ లాగు కరో.. వర్ణ కుర్చీ ఖాళీ కరో’ అని పార్లమెంటులో నినాదం ఇచ్చి ఢిల్లీలోని బోర్డ్స్ క్లబ్ వద్ద వేలాది మందితో ధర్నాలు చేసి మండల్ కమిషన్ అమలయ్యేలా, బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 శాతం రిజర్వేషన్లు పొందడంలో కాన్షీరాం పాత్ర మరువలేనిది.

అయితే అప్పుడు అధికారంలో ఉన్న జనతాపార్టీ తమ అధికార కుర్చీకి ఎసరు పడుతుందేమోనని భావించి మండల్ కమిషన్‌కు ఆమోదం తెలిపింది. అలా గే కాంగ్రెస్ పార్టీ కాకా కాలేకర్ క మిషన్‌ను పక్కనబెట్టి మండల్ కమిషన్‌ను కూ డా అమలు కాకుండా ప్రతీసారి బీసీల అభివృద్ధికి అ డ్డం పడుతూనే వస్తుంది. తెలంగాణలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్న సమయంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటాను తగ్గించి బీసీల వ్యతిరేకులమని బాహటంగానే నిరూపించారు.

మరి ఇప్పుడు మాత్రం బీసీలకు 42 శాతం రిజ ర్వేషన్లు అమలు చేయాలంటూ రోడ్లపైకి వచ్చి నిరసన చేయడం వల్ల ఎవరికీ ప్రయోజనమనేది ఆలోచించుకోవాలి. అప్పట్లో ఉత్తర్ ప్రదేశ్‌లో బీసీలను, అణగారిన వర్గాలను బహుజన్ సమాజ్ పార్టీ చట్టసభల్లోకి తీసుకుని వెళ్లింది. చాకలి, మం గలి, కుమ్మరి, వడ్డెర లాంటి జాతులన్నింటినీ చట్ట సభల్లోకి తీసుకెళ్లి తమ చిత్తశుద్ధిని చాటుకుంది.

అలాంటి బహుజన్ సమాజ్‌క పార్టీకి అండగా నిలబడి బీసీలంతా తమ వాటాను సాధించుకునే దిశగా అడుగులు వేయాలి. బీసీలకు న్యాయం చేస్తామని మాట్లాడే ప్రతి నాయకుడు తక్షణమే తమ పదవులకు రాజీనామా చేయాలి. బీసీల అస్థిత్వానికై పోరా డుతున్నామని పేర్కొంటున్న ఆర్. కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, బండి సంజయ్, మహేశ్ కుమార్ గౌడ్‌లు బీసీ జేఏసీ తరఫున ఐక్యంగా నిలబడి బీసీలకు 42 శాతం కోటా సాధించేందుకు కలిసికట్టుగా పోరాడాలి.

ఈడబ్ల్యూఎస్ ద్వారా 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తే ఎవరు కోర్టుకు వెళ్లరు. కానీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామనగానే గిట్టనివారు వెంటనే కోర్టు తలుపులు తట్టడం, కోర్టులు కూడా స్టేలు విధిస్తూ వారికి వంత పాడడం జరుగుతుంది. దేశంలో ఉన్న సంపదనంతా జనా భా దామాషా ప్రకారం అన్ని కులాలు సమాన హక్కును అనుభవించాలి.

అందునా దేశ జనాభాలో అగ్రభాగం బీసీ కులాలే ఉన్నప్పటికీ వారికి అం దుతున్న ఫలాలు మాత్రం తక్కువగానే ఉంటున్నాయి. ఈ విధానంలో మార్పు రావాల్సిన అవసరముంది. బహుజన్ సమాజ్ పార్టీ బీసీల కోసం ఎప్పటికీ పోరాటం చేస్తూనే ఉంటుంది. బీసీ నేతలంతా ఐక్యంగా ఉద్యమించినప్పుడే సమస్యలకు పరిష్కారం ఉంటుంది.

బోయిని చంద్రశేఖర్, 9492453888