calender_icon.png 30 October, 2025 | 12:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంట హత్య కేసు.. నిందితుడికి ఏడేళ్ల జైలు

29-10-2025 10:01:18 PM

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జంట హత్య కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ స్పెషల్ జడ్జ్ కే కిరణ్ కుమార్ బుధవారం తీర్పు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. పాల్వంచ మండలం మంచికంటినగర్ కు చెందిన రాజేశ్వరి హత్యకు, ఆమె భర్త అశోక్ ఆత్మహత్యకు కారకుడైన మాచర్ల యేసు బాబుకు శిక్ష పడింది. ఈ కేసును విచారించిన కొత్తగూడెం కోర్టులో 16 మంది సాక్షులను విచారించగా, నిందితుడి నేరం రుజువైంది. దీంతో కొత్తగూడెం ప్రిన్సిపల్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి కే.కిరణ్ కుమార్ నిందితుడికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ. 10 వేల జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు.