calender_icon.png 30 October, 2025 | 12:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవీన్ యాదవ్ గల్లీల బిడ్డ... గడీల బిడ్డ కాదు..!

29-10-2025 08:51:44 PM

తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు..

జాజిరెడ్డిగూడెం/అర్వపల్లి: నవీన్ యాదవ్ గడీల బిడ్డకాదు.. గళ్ళీల బిడ్డ, గరీబోళ్ల బిడ్డ.. అని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు అన్నారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోరుతూ బుధవారం బోరబండ, రాజ్ నగర్ కాలనీలలో జాజిరెడ్డిగూడెం మండలంలోని రాష్ట్ర, జిల్లా నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేదల పక్షపాత ప్రభుత్వమని, జూబ్లీహిల్స్ కు కావాల్సింది సెంటిమెంట్ కాదు డెవలప్మెంట్ అని అన్నారు.

బీఆర్ఎస్ మాయమాటలకు మోసపోవద్దని, మోసపోతే గోసపడతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చేతి గుర్తుకు ఓటు వేసి నవీన్ యాదవ్ ని అత్యధిక మెజారిటీతో గెలిపించి అభివృద్ధికి తోడ్పాటునందించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు, తిమ్మాపురం గ్రామ మాజీ సింగిల్ విండో చైర్మన్ ఇందుర్తి వెంకట్ రెడ్డి, జిల్లా నాయకులు గుడిపెల్లి మధుకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు వేల్పుల రమేష్, బోరబండ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ అనిల్ గౌడ్, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.