12-08-2025 07:34:41 PM
బీసీ జేఏసీ జిల్లా ఇంచార్జ్ మహేష్ వర్మ..
లక్షేట్టిపేట (విజయక్రాంతి): బహుజన రాజ్యాధికారంతోనే బీసీలకు న్యాయం చేకూరుతుందని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న పని చేస్తున్నారని బీసీ జేఏసీ మంచిర్యాల జిల్లా ఇంచార్జ్ మహేష్ వర్మ(BC JAC District Incharge Mahesh Verma) అన్నారు. మంగళవారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బీసీ నాయకులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్బంగా బీసీ జేఏసీ నాయకులు ఒడ్డేపల్లి మనోహర్, మహేష్ వర్మ లు మాట్లాడుతూ, ఈ రాష్ట్రములో బీసీల రాజ్యాధికారం కోసం ప్రతి ఒక్కరు ముందుకు రావాలన్నారు. బీసీల నాయకత్వంలో ఎస్సీ, ఎస్టీ ముస్లిం మైనారిటీలను కలుపుకొని బహుజన రాజ్యాధికారం సాధించుకోవడం కోసం అందరం కలిసి కట్టుగా పోరాటం చేయాలన్నారు. ఈ సమాజంలో 60 శాతం ఉన్నటువంటి బీసీల ఓట్లు ఎన్నికల్లో ఎంతో కీలకమన్నారు. మన ఓటు మనమే వేసుకుని రాజ్యాధికారం సాధించాలని వివరించారు.
దీనిలో భాగంగా మంచిర్యాలలో ఈనెల 20న ఏర్పాటు చేస్తున్నటువంటి సభకు మన బీసీల ఆశాజ్యోతి ఏమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్, బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ సుధాగాని హరిశంకర్ గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సంగం సూర్యారావు, జానయ్య యాదవ్, బీసీ ఉద్యమకారుడు హిందూ బీసీ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు బత్తుల సిద్దేశ్వర తదితరులు పాల్గొంటారని వెల్లడించారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న బీసీ సంఘం నాయకులు బీసీ ప్రజలు, మహిళలు, విద్యార్థులు అధిక పాల్గొని ఈ సభను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నామన్నారు. ఈ సమావేశంలో లక్షట్ పేట బీసీ సంఘం నాయకులు మాజీ జెడ్పీటీసీ ముత్తే సత్తయ్య, కళ్యాణం రవి, అంకతి గంగాధర్, చింతకింది సుధాకర్, బొప్పుస్వామి ముక్కెర చంద్రమౌళి, సిరిపురం రవి, రాందేని కోటేష్, బైరం చిన్నయ్య, భైరం చిన్నయ్య, నేరెళ్ల సత్తయ్య,సంఘ లచ్చన్న, గడ్డం సుధాకర్, తోట వెంకటేష్, మాలేం సుభాష్, అంకతి చిన్న తదితరులు పాల్గొన్నారు.