29-01-2026 12:00:00 AM
హనుమకొండ, జనవరి 28 (విజయ క్రాంతి): భారత ఎన్నికల కమిషన్ నిర్వహిస్తున్న ఓటర్ల జాబితాల ప్రత్యేక తీవ్రత సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో ప్రభుత్వ యంత్రాంగానికి మూవ్మెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ హనుమకొండ తరపున పూర్తి మద్దతును ప్రకటించింది. మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ హనుమకొండ మండల రెవెన్యూ అధికారికి మద్దతు లేఖను సమర్పించారు.దీనిలో బూత్ లెవల్ ఆఫీసర్లు, మరియు గ్రౌండ్ లెవెల్ లో పనిచేసే బృందాలతో పూర్తి సహకారానికి హామీ ఇచ్చారు.
ఈ సందర్భంగా ఎంపిజె ప్రతినిధులు సంస్థ యొక్క వాలంటీర్లు ఓటరు జాబితా ధృవీకరణ, మ్యాపింగ్, ప్రజా అవగాహన మరియు డాక్యుమెంటేషన్ ప్రక్రియలో బిఎల్వో బృందాలతో పూర్తిగా సహకరిస్తారని మరియు సర్ ప్రక్రియ పూర్తయ్యే వరకు ఈ సహకారం కొనసాగుతుందని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీజే బృంద సభ్యులు ముహమ్మద్ అబ్దుల్ ఖుద్దూస్, ఎంపీజే హనుమకొండ అధ్యక్షుడు మహమ్మద్ మజీద్ ఫరీద్, ప్రధాన కార్యదర్శి ముహమ్మద్ కలీమ్ ఖాన్, తదితరులు పాల్గొన్నారు.